16th October 2026

_________

- Bhuvana

శ్రీలీలకు సినిమాల కన్నా సైడ్ ఇన్‌కమ్ ఎక్కువ!

సినిమా ఆఫర్లు తగ్గినా.. సంపాదనలో మాత్రం తగ్గేదేలే అన్నట్లు దూసుకుపోతోంది!  శ్రీలీల సైడ్ ఇన్కమ్ వెనుక అసలు లెక్క ఏమిటి?

మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ వంటి స్టార్ హీరోల సినిమాల్లో నటించి గుర్తింపు తెచ్చుకుంది.  ఆ క్రేజ్ ఇప్పుడు ఆమెకు ఇతర మార్గాల్లోనూ అవకాశాలు తెచ్చిపెడుతోంది.

స్టార్ హీరోలతో సినిమాలు భారీ క్రేజ్!

వరుస పరాజయాల ప్రభావంతో శ్రీలీలకు తెలుగులో కొత్త సినిమా అవకాశాలు తగ్గాయనేది నిజం. దానికి తోడు మమతా బైజు వంటి జెన్ జీ హీరోయిన్స్ ఎంట్రీ కూడా దెబ్బ కొడుతోంది.  

తెలుగు సినిమాల్లో అవకాశాలు తగ్గాయా?

శ్రీలీలకు ఇన్‌స్టాగ్రామ్‌లో భారీ ఫాలోయింగ్ ఉండటంతో బ్రాండ్ ప్రమోషన్లతో ఆదాయం బాగా వస్తోంది. కొన్ని ప్రమోషనల్ పోస్టుల ద్వారా నెలకు రూ.30 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు సంపాదిస్తున్నట్లు తెలుస్తోంది.

ఇన్‌స్టాగ్రామ్‌తోనూ లక్షల ఆదాయం?

శ్రీలీలకు యాడ్స్ రూపంలోనూ ఆదాయం వస్తోంది. తాజాగా హెచ్‌ఎండీ స్మార్ట్‌ఫోన్స్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా ఆమెను నియమించినట్లు తెలిసింది.  

ప్రముఖ కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్!

ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో షాపుల ప్రారంభోత్సవాలు, ఇతర ఈవెంట్లకు సైతం  శ్రీలీల బాగా హాజరు అవుతోంది. ఇలాంటి కార్యక్రమాల నుంచి ఆదాయం వస్తున్నట్లు తెలుస్తోంది.

షాప్ ఓపెనింగ్స్‌తోనూ సంపాదన!

కార్తీక్ ఆర్యన్‌తో శ్రీలీల నటిస్తున్న పేరులేని రొమాంటిక్ మ్యూజికల్ సినిమా విడుదల తేదీని 2027 ఏప్రిల్ 30గా ప్రకటించారు. ఈ ప్రాజెక్ట్ ఆమె హిందీ కెరీర్‌కు కీలకంగా మారే అవకాశం ఉంది.  

బాలీవుడ్‌లోనూ కొత్త ప్రయత్నం!

శ్రీలీలకు  తక్కువ సమయంలో ఎక్కువ ఆదాయం తెచ్చిపెట్టేవి సైడ్ ఇన్కమ్ లే. అదే సినిమాకు చాలా టైమ్, డేట్స్ అవసరం.

సినిమా రెమ్యునరేషన్ vs సైడ్ ఇన్‌కమ్.. ఏది ఎక్కువ?

క్రేజ్ ఉంటేనే సైడ్ ఇన్కమ్. లేకుంటే ఎవరూ పట్టించుకోరు.  కాబట్టి శ్రీలీల మరో పెద్ద సినిమా పట్టాలి, పెద్ద హిట్ కొట్టాలి.  

క్రేజ్ ఉంటే అవకాశాలకు కొదవ లేదా?