రష్మిక కల్చర్ కు ఫిదా అవుతున్న ఫ్యాన్స్
విజయ్ దేవరకొండను పెళ్లి చేసుకున్న తర్వాత రష్మిక మందన్న తన పర్సనల్ లైఫ్ లో తెలుగు సంప్రదాయాలకు ఇస్తున్న ప్రాధాన్యత అభిమానులను ఆకట్టుకుంటోంది. పెళ్లి తర్వాత మంగళసూత్రం, నల్లపూసలు, మెట్టెలు ధరించి కనిపిస్తున్న ఈ స్టార్ హీరోయిన్.. తాజాగా తన రణబాలి సినిమా ప్రమోషన్లలోనూ అదే సంప్రదాయాన్ని కొనసాగిస్తోంది. దీంతో ఆమె లుక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.
ప్రస్తుతం రణబాలి సినిమా ప్రమోషన్లలో పాల్గొంటున్న రష్మిక.. మోడ్రన్ ఫ్యాషన్ కు ప్రాధాన్యత ఇస్తూనే సంప్రదాయాలను మరిచిపోవడం లేదు. ముఖ్యంగా స్టేజ్ పై ఆమె కాళ్లకు మెట్టెలు కనిపించడంతో ఫ్యాన్స్ ఆశ్చర్యానికి గురవుతున్నారు. సాధారణంగా సినిమా వేడుకల్లో తమ స్టైలిష్ లుక్స్‌తో ఆకట్టుకునే హీరోయిన్లు జ్యుయలరీ విషయంలో ట్రెండ్స్‌ను ఫాలో అవుతుంటారు. కానీ రష్మిక మాత్రం పెళ్లి తర్వాత తన సంప్రదాయబద్ధమైన రూపాన్ని కంటిన్యూ చేస్తూ స్పెషల్ గా నిలుస్తోంది.

స్టార్ హీరోయిన్గా వరుస సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ, పర్సనల్ లైఫ్ లో తనదైన శైలిలో సంప్రదాయాలకు ప్రాధాన్యత ఇవ్వడం రష్మిక స్పెషాలిటీగా మారింది. పెళ్లి తర్వాత ఆమె లుక్‌లో కనిపిస్తున్న ఈ మార్పులు ఫ్యాన్స్ లో ఆసక్తిని పెంచుతున్నాయి. ముఖ్యంగా నల్లపూసలతో పాటు మెట్టెలు ధరించి కనిపించడం ఆమె ఫ్యాన్స్ ను మరింత ఆకట్టుకుంటోంది. స్క్రీన్ పై గ్లామరస్ పాత్రలతో అలరించే రష్మిక.. రియల్ లైఫ్ లో కల్చర్ ను గౌరవిస్తూ కనిపించడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.








