అక్టోబర్ 31న డల్లాస్లో శ్రీకాళహస్తీశ్వరస్వామి కళ్యాణ మహోత్సవం
అమెరికాలోని డల్లాస్ పరిసర ప్రాంతంలో నివసించే ప్రవాస భారతీయులు, ఆధ్యాత్మిక భక్తుల కోసం గ్రేటర్ రాయలసీమ అసోసియేషన్ ఆఫ్ డల్లాస్ ఏరియా (GRADA) శ్రీ జ్ఞానప్రసూనాంబికా సమేత శ్రీకాళహస్తీశ్వరస్వామి కళ్యాణ మహోత్సవం, మహాన్యాస పూర్వక రుద్రాభిషేక కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. భారత్లోని ప్రసిద్ధ శ్రీకాళహస్తి దేవస్థానం నుండి ప్రత్యేకంగా విచ్చేస్తున్న అర్చక స్వాముల పర్యవేక్షణలో ఈ దివ్య కార్యక్రమం అత్యంత వైభవంగా జరగనుంది. లోక కల్యాణం, శాంతి, సమృద్ధి, ఆరోగ్య ప్రదానం కోసం స్వామివారి ఆశీస్సులు పొందడానికి భక్తులందరినీ గ్రాడా కమిటీ ఆహ్వానిస్తోంది.
పూజా వివరాలు..
తేదీ: అక్టోబర్ 31, 2026, శనివారం.
సమయం: ఉదయం 9:00 గంటల నుండి మధ్యాహ్నం 2:00 గంటల వరకు.
వేదిక: ఇండెపెండెన్స్ హైస్కూల్, 10555 పార్క్వే, ఫ్రిస్కో, టెక్సాస్ 75035 (Independence High School, 10555 Pkwy, Frisco, TX 75035).
ప్రత్యేకతలు: శ్రీకాళహస్తి క్షేత్ర అర్చకులతో మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం, శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దివ్య కళ్యాణ మహోత్సవం, మహాప్రసాద వితరణ.
ఆసన సదుపాయం, మహాప్రసాదం, శేషవస్త్రాల పంపిణీ ఏర్పాట్లు సజావుగా సాగేందుకు పాల్గొనే ప్రతీ కుటుంబం ముందస్తుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని నిర్వాహకులు కోరుతున్నారు. రిజిస్ట్రేషన్ గడువు అక్టోబర్ 25, 2026. భక్తులు ఫ్లయర్పై ఉన్న క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి లేదా ఆన్లైన్ ఫారమ్ లింక్ ద్వారా ఉచితంగా తమ పేర్లను నమోదు చేసుకోవచ్చు.
స్పాన్సర్షిప్ వివరాలు: గోల్డ్ ($751), సిల్వర్ ($516), బ్రాంజ్ ($216), రుద్రాభిషేకం ($101), అర్చన ($51).
సంప్రదింపుల ఫోన్ నంబర్లు:
జగదీశ్వర: (469) 999-2596
హరినాథ: (901) 236-3506
జనార్ధన్: (737) 420-8343
డల్లాస్, ఫ్రిస్కో, నార్త్ టెక్సాస్ ప్రాంతంలోని శివభక్తులందరూ ఈ పవిత్ర కార్యక్రమంలో పాల్గొని శ్రీ జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వరస్వామి వారి దివ్య ఆశీస్సులు పొందాలని గ్రాడా(GRADA) కార్యవర్గ ప్రతినిధులు కోరుతున్నారు.








