TACO ఆధ్వర్యంలో ‘‘దీపావళి విందు’’ కార్యక్రమం
తెలుగు అసోసియేషన్ ఆఫ్ సెంట్రల్ ఒహియో (TACO) దీపావళి సందర్భంగా ఓ ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. అయితే ఈ దీపావళి పూజలతోనో, టపాకాయలతోనో, దీపాలతోనో కాదు. మహా విందుతో ఈ దీపావళిని చేసేందుకు సిద్ధమైంది.రాయలసీమ ఘుమఘుమలు… తెలంగాణ నోరూరించే రుచులు… మన తెలుగు సంప్రదాయాలను గుర్తుచేసే పసందైన విందును ఏర్పాటు చేస్తున్నారు.
ఈ రాయలసీమ, తెలంగాణ రెండు ప్రాంతాల ప్రత్యేక వంటకాలతో Hyderabad House వారు మీ కోసం అద్భుతమైన విందును సిద్ధం చేస్తున్నారు. రాయలసీమ, తెలంగాణ ప్రాంతాల వారికి నచ్చే విందును ఏర్పాటు చేయనున్నారు. ‘‘రాయలసీమ ఘాటు.. తలెంగాణ రుచి.. తెలుగు రుచుల మహావిందు’’ ట్యాగ్ తో దీనిని నిర్వహిస్తున్నారు.
నవంబర్ 15 న జరిగే ఈ విందు కార్యక్రమంఉదయం 10:30 గంటల నుంచి Licking Heights High School వేదికగా ఇది జరగనుంది. అయితే.. నాన్ మెంబర్స్ కచ్చితంగా ముందే రిజిస్ట్రేషన్ చేసుకోవాలని నిర్వాహకులు సూచిస్తున్నారు. టిక్కెట్లు పరిమితంగానే వున్నాయని, వెంటనే బుక్ చేసుకోవాలని నిర్వాహకులు సూచిస్తున్నారు.
కార్యక్రమ వివరాలు :
తేదీ : నవంబర్ 15
సమయం : ఉదయం 10:00 గంటల నుంచి
వేదిక : Licking Heights High School







