తెలుగు అసోసియేషన్ ఆఫ్ మిన్నెసోటా ఆధ్వర్యంలో ‘‘వాలీబాల్ టోర్నమెంట్ 2026’’
క్రీడాభిమానులను ఉత్సాహపరిచేందుకు మరియు ప్రవాస భారతీయ క్రీడాకారులలో ఉత్సాహాన్ని నింపేందుకు తెలుగు అసోసియేషన్ ఆఫ్ మిన్నెసోటా ‘‘దేశీ వాలీబాల్ టోర్నమెంట్ 2026 ని నిర్వహిస్తోంది. మిన్నెసోటాలో ‘MDVT (Minnesota Desi Volleyball Tournament) 2026’ వాలీబాల్ టోర్నమెంట్ అత్యంత వైభవంగా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
నవంబర్ 14 న జరిగే ఈ పోటీలు Eden Prairie High School, 17185 Valley View Rd, Eden Prairie, MN 53346 వేదికగా జరగనున్నాయి. స్థానిక ప్రవాసాంధ్ర/భారతీయ సంఘాల ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ క్రీడా వేడుకకు పలువురు ప్రముఖులు మరియు వ్యాపార సంస్థలు స్పాన్సర్లుగా వ్యవహరిస్తున్నాయి. ఇండియా స్పైస్ హౌస్, గ్లోబల్ ఇంటెలెక్చువల్స్, గోలి రియాల్టీ గ్రూప్, స్పైస్ ర్యాక్, ఇమాజిన్ రియాల్టీ (లలిత్ ప్రసాద్) తదితరులు ఈ టోర్నమెంట్‌కు సహాయ సహకారాలు అందిస్తున్నారు.
ఇక మరిన్ని వివరాల కోసం బాలా (813) 466-0814, వెంకీ (512)665-5142, అర్జున్ (952) 847-7689), గన (404) 883-8541 నెంబర్లకు సంప్రదించవచ్చు.







