కాన్సులేట్ ఆధ్వర్యంలో ‘‘దీపావళి క్విజ్’’..ఈసారి జ్ఞానమయ దీపావళి జరుపుకుందాం…
అందరమూ దీపావళిని టపాకాయలు, దీపాలతో సెలబ్రేట్ చేసుకుంటాం. కానీ.. ఈసారి ఇంకా కొత్త పంథాలో మన దీపావళిని సెలబ్రేట్ చేసుకుందాం. కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా శాన్ ఫ్రాస్కిస్కో భారత్ వర్స్, భారత్ కో జానియే సంయుక్త ఆధ్వర్యంలో ‘‘దీపావళి క్విజ్’’ ను నిర్వహిస్తున్నారు.
దీనిని Diwali, Deepavali,Deepawali diffrenet namesacross india, one festivel of lights అన్న థీమ్ తో దీనిని నిర్వహిస్తున్నారు. నవంబర్ 3 నుంచి 10 వ తేదీ వరకూ ఈ క్విజ్ కొనసాగుతుంది. దేశవ్యాప్తంగా ఎంతో వైభవంగా జరుపుకునే ఈ దీపావళి పండుగ గురించి మీకే ఎంతవరకు తెలుసు? అనే అంశంపై ప్రజల కోసం ఈ ఆసక్తికరమైన క్విజ్ పోటీని అందుబాటులోకి తెచ్చారు.
ముఖ్యమైన వివరాలు ఇవీ.,..
పోటీ జరిగే తేదీలు: నవంబర్ 3 నుండి 10, 2026 వరకు.
ఎక్కడ ఆడాలి: ఆసక్తి గల వారు bkjquiz.com వెబ్సైట్ ద్వారా నేరుగా పాల్గొనవచ్చు.
యాప్ లభ్యత: మొబైల్ వినియోగదారుల కోసం గూగుల్ ప్లే స్టోర్ (Google Play) అలాగే యాప్ స్టోర్ (App Store)లో ఈ యాప్ అందుబాటులో ఉంది.
ప్రముఖమైన ‘భారత్ కో జానియే క్విజ్’ ఇప్పుడు ‘భారత్వర్స్’గా పునఃరూపకల్పన చేయబడింది — ఇది ఉత్తేజకరమైన క్విజ్లు, గేమ్‌లు, క్రాస్‌వర్డ్‌లు, రోజువారీ సవాళ్లు మరియు మరెన్నో అంశాలతో కూడిన ఒక డైనమిక్, 24×7 గేమిఫైడ్ ప్లాట్‌ఫామ్, ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలకు భారతదేశాన్ని మరింత చేరువ చేస్తుందని కాన్సులేట్ పేర్కొంది.
కాబట్టి, ఈ దీపావళి పండుగ వేళ మీ జ్ఞానాన్ని పరీక్షించుకుంటూ ఈ ప్రత్యేక క్విజ్‌లో పాల్గొని విజయం సాధించండి. ఈ సారి మన దీపావళి జ్ఞానమయ దీపావళి కావాలి. మనకున్న తెలివి తేటలను ఉపయోగించి క్విజ్ లో విజయం సాధించాలి .







