ట్రంప్ కి గడ్డు కాలం… అవినీతిపై విచారణ చేపడతామంటున్న డెమోక్రాట్లు
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కి కష్టకాలం రాబోతోందా? ఆయన అవినీతిపై విచారణ జరిపేందుకు డెమోక్రాట్లు సిద్ధమవుతున్నట్లు వార్తలు మాత్రం వస్తున్నాయి. ఎందుకంటే అవినీతిని కూడా ప్రజలు అసహ్యించుకుంటున్నారని, అది కూడా రిజల్ట్స్ పై ప్రభావం చూపించిందని డెమోక్రాట్లు బలంగా విశ్వసిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ట్రంప్, ఆయన అనుచరులు పాల్పడిన అవినీతిపై దర్యాప్తు జరిపిస్తామని అంటున్నారు. మధ్యంతర ఎన్నికల్లో నెగ్గి, మంచి దూకుడు వున్న డెమోక్రట్లు ట్రంప్ ను రాజకీయంగా దెబ్బకొట్టాలని తమ దగ్గర వున్న అన్ని అస్త్రాలనూ ప్రయోగించేందుకు సిద్ధపడుతున్నారు.
ట్రంప్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన వ్యక్తిగత ఆస్తులు, ఆయన కుటుంబ ఆస్తులు పెరిగాయని అంటున్నారు. అంతేకాకుండా అవసరమైతే ట్రంప్ పై అభిశంసన పెట్టడానికి కూడా వెనకాడే ప్రసక్తే లేదన్న యోచనలో వున్నట్లు వార్తలు వస్తున్నాయి.
ట్రంప్ కుటుంబ వ్యాపార వ్యవహారాలు, వైట్ హౌస్ బాల్ రూమ్ తో పాటు వాషింగ్టన్ చుట్టు పక్కల చేపట్టిన నిర్మాణాలు, ఎప్ స్టీన్ ఫైళ్లు, వలసదారులపై ఇమిగ్రేషన్ కస్టమ్స్ ఎన్ ఫోర్స్ మెంట్ దాడులు, డిపార్ట్ మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫీషియన్సీ పనితీరు అలాగే ట్రంప్ తో సంబంధాల ద్వారా కొన్ని ఫార్మా కంపెనీలు పొందిన లబ్ధిపై కూడా దర్యాప్తు చేయించేందుకు డెమోక్రెట్లు సిద్ధమవుతున్నవారు. ఈ విషయాన్ని డెమోక్రటిక్ సెనేటర్ రాన్ వైడెన్ కూడా ప్రకటించారు.






