ఆస్టిన్ ప్రవాసుల కోసం భారత కాన్సులేట్ ఆధ్వర్యంలో ‘‘కౌన్సులర్ క్యాంప్’’
అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రం, ఆస్టిన్ నగరంలో వుంటున్నవాస భారతీయుల కోసం హూస్టన్‌లోని భారత కాన్సులేట్ జనరల్ కార్యాలయం (Consulate General of India, Houston) ‘సేవా ఇంటర్నేషనల్ – ఆస్టిన్ చాప్టర్’ ‘సహకారంతో ఒక ప్రత్యేక కౌన్సులర్ క్యాంపును నిర్వహిస్తోంది. ‘‘CONSULAR CAMP bringing consuler services closer to you అన్న థీమ్ తో దీనిని నిర్వహిస్తున్నారు.
నవంబర్ 21 వ తేదీన ఉదయం 10:00 గంటల నుంచి సాయంత్రం 5:00 గంటల వరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అలాగే కోర్ట్‌యార్డ్ బై మేరియట్ నార్త్‌వెస్ట్/లేక్లైన్ (Courtyard by Marriott Northwest/Lakeline), 12833 రాంచ్ రోడ్ 620 నార్త్, ఆస్టిన్, TX 78750. వేదికగా ఈ కార్యక్రమం వుంటుంది.
ఈ క్యాంపులో అందించే ప్రధాన సేవలివే…
భారతీయ మూలాలున్న అమెరికన్ పాస్‌పోర్ట్ హోల్డర్ల కోసం:
ఓసీఐ (OCI) కార్డుల జారీ, రెన్యూవల్ మరియు సంబంధిత సేవలు
వీసా దరఖాస్తులు
భారతీయ పౌరసత్వ ఉపసంహరణ (Renunciation of Indian Nationality)
2.భారతీయ పాస్‌పోర్ట్ హోల్డర్ల కోసం:
భారతీయ పాస్ పోర్టు రెన్యువల్
పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికేట్
గ్లోబల్ ఎంట్రీ ప్రోగ్రామ్
3.ఇతర కౌన్సులర్ సేవలు (Miscellaneous Services):
డాక్యుమెంట్లు, పవర్ ఆఫ్ అటార్నీ ధ్రువీకరణ
మృతదేహాల రవాణాకు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్
ఇతర కౌన్సులర్ సేవలు
దరఖాస్తుదారులు తప్పనిసరిగా ఈ క్యాంపు కోసం ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకోవాలి. వీఎఫ్ఎస్ (VFS) కార్యాలయానికి వెళ్లడానికి లేదా డాక్యుమెంట్లు పోస్ట్ చేయడానికి బదులుగా, ఈ క్యాంపునకు నేరుగా తమ పత్రాలను తీసుకెళ్లవచ్చు. పోస్టర్లో ఇవ్వబడిన క్యూఆర్ కోడ్ (QR Code) ద్వారా రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేయవచ్చు.ఆస్టిన్ మరియు చుట్టుపక్కల ప్రాంతాలలో ఉన్న ప్రవాస భారతీయులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు కోరుతున్నారు.







