విజయ్ ఆంటోని ‘నాన్న కుట్టి’ నుంచి ‘నాలోన నే లేను’ అంటూ సాగే లవ్ సాంగ్ రిలీజ్
వెర్సటైల్ హీరో విజయ్ ఆంటోని ప్రస్తుతం ‘నాన్న కుట్టి’ అంటూ ఆడియెన్స్‌ని మెప్పించేందుకు రెడీ అయ్యారు. విజయ్ ఆంటోని ఫిల్మ్ కార్పోరేషన్ బ్యానర్ మీద మీరా విజయ్ ఆంటోని నిర్మాతగా ము. మారన్ దర్శకత్వంలో ఈ చిత్రం రాబోతోంది. ఈ సినిమాకి సర్వంత్ రామ్ క్రియేషన్స్ బ్యానర్ అధినేత రామంజనేయులు జవ్వాజీ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ మూవీని నవంబర్ 20న రిలీజ్ చేయబోతోన్నారు. ఈ క్రమంలో ఇప్పటి వరకు రిలీజ్ చేసిన పోస్టర్లు, సాంగ్స్ అన్నీ కూడా ఆడియెన్స్‌లో బజ్‌ను పెంచేశాయి. తాజాగా ఈ చిత్రం నుంచి లవ్, మెలోడీ సాంగ్‌ను విడుదల చేశారు.
‘నాలోన నే లేను’ అంటూ సాగే ఈ లవ్ సాంగ్ అందరినీ కట్టి పడేసేలా ఉంది. అమ్మాయి కోణంలోంచి సాగే ఈ సాంగ్ వన్ సైడ్ లవ్‌లోని స్వీట్నెస్ను చూపించేలా ఉంది. విజయ్ ఆంటోని బాణీ.. భాష్య శ్రీ సాహిత్యం.. రుక్షర్ బంధుకియా గాత్రం ఈ పాటకు ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఈ వీడియో సాంగ్‌లో ప్రతీ అస్రానీ అందం, విజువల్స్ హైలెట్‌గా నిలిచాయి. ఈ పాటలోస్కూల్ టీచర్‌గా ప్రీతి అస్రానీ ఎంతో నేచురల్‌గా కనిపిస్తున్నారు.
ఈ చిత్రంలో ప్రీతి అస్రాని, లిథన్య, భగవతి పెరుమాళ్, హరిప్రియ ఇసై, అరువి మధన్, చిత్ర లక్ష్మణన్, శ్రీజ రవి, వెట్టై ముత్తుకుమార్, జెన్సన్ దివాకర్, మురుగానందం, మున్నార్ రమేష్, లిస్సీ ఆంటోని, కుమార్ నటరాజన్, విజయన్, ప్రవీణ, హరిత, హరిప్రియ తదితరులు ముఖ్య పాత్రల్ని పోషించారు.
రాజీవ్ రాజేంద్రన్ సినిమాటోగ్రఫర్‌గా పని చేయగా, విజయ్ ఆంటోనీ సంగీతం అందించడంతో పాటు ఎడిటర్‌గా కూడా వ్యవహరించారు. ఎ. రాజా ప్రొడక్షన్ డిజైన్ బాధ్యతలు నిర్వర్తించారు.
యాక్షన్, ఫ్యామిలీ ఎమోషన్స్, భావోద్వేగ కథనం, హృద్యమైన సంగీతం, ఆకట్టుకునే స్క్రీన్‌ప్లేతో ‘నాన్న కుట్టి’ చిత్రం రానుంది. నవంబర్ 20న ఈ చిత్రం గ్రాండ్‌గా రిలీజ్ కానుంది.







