TAMA ఆధ్వర్యంలో చెస్ టోర్నమెంట్..
అట్లాంటా తెలుగు సంఘం (TAMA) తన 45 వ వార్షికోత్సవం సందర్భంగా అద్భుతమైన క్రీడా వేడుకను ప్రకటించింది. అట్లాంటా వాసుల కోసం ‘‘టామా’’ చెస్ టోర్నమెంట్ ను నిర్వహించేందుకు ముందుకు వచ్చింది. దీంతో చదరంగం ప్రియులకు ఓ అద్భుతమైన అవకాశం దొరికినట్లే అయ్యింది.
నవంబర్ 15 వ తేదీన సెకండ్ అండ్ ఫైనల్ టోర్నమెంట్ ను నిర్వహిస్తున్నారు. నవంబర్ 15 వ తేదీన ఉదయం 9:00 గంటల నుంచి మధ్యాహ్నం 1:00 గంటల వరకు Desana Middle school three-round swiss system వేదికగా ఈ చదరంగపు పోటీలు జరగనున్నాయి. G/25 d5 (త్రీ-రౌండ్ స్విస్ సిస్టమ్ ఫార్మాట్ లో జరగనుంది.
ఈ టోర్నమెంట్లో వివిధ వయసులు మరియు ప్రతిభ ఆధారంగా ప్రత్యేక విభాగాలను కూడా కేటాయించారు.
రేటెడ్ (Rated): U500, U1000, U1500 (ప్రస్తుత USCF మెంబర్షిప్ తప్పనిసరి).
అన్రేటెడ్ (Unrated): అన్రేటెడ్, K-3, 4-5, 6-12, మరియు పెద్దలు (Adults).
నలుగురికంటే తక్కువ ఆటగాళ్లు ఉంటే సెక్షన్లు కలపడం లేదా రద్దు చేయడం జరుగుతుంది.ప్రతి విభాగంలో ప్రతిభ కనబరిచిన విజేతలకు ఆకర్షణీయమైన ట్రోఫీలను అందజేయనున్నారు.
ఇక.. రిజిస్ట్రేషన్ కోసం www.tama.org/chess వెబ్ సైట్ ను సందర్శించవచ్చు. అలాగే ఫీజు వివరాలిలా వున్నాయి. టామా సభ్యులకు: $30
సభ్యులు కానివారికి: $35 డాలర్లుగా నిర్వాహకులు నిర్ణయించారు.
ఈ టోర్నమెంట్ను విజయవంతం చేయడానికి టామా అధ్యక్షులు సునీత పోట్నూరి, స్పోర్ట్స్ & యూత్ సెక్రటరీ హరికృష్ణ అద్దంకి, మరియు ఛైర్మన్ మధుకర్ యార్లగడ్డ లతో పాటు కార్యవర్గ సభ్యులు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.
పిల్లల్లో ఏకాగ్రతను పెంచి, ఆలోచనా శక్తిని పెంపొందించే ఈ అద్భుతమైన పోటీలో తెలుగు వారందరూ ఉత్సాహంగా పాల్గొని విజయవంతం చేయాలని నిర్వాహకులు కోరుతున్నారు.
మరిన్ని వివరాల కోసం ప్రెసిడెంట్ సునీతా పొట్నూరు (404) 988-9429, స్పోర్ట్స్ సెక్రెటరీ హరికృష్ణ అద్దంకి (470) 263-5228, చైర్మన్ మధుకర్ యార్లగడ్డ చైర్మన్ (913) 609-3563 ని సంప్రదించవచ్చు.
కార్యక్రమ వివరాలు :
తేదీ : నవంబర్ 15
సమయం : ఉదయం 9:00 గంటల నుంచి మధ్యాహ్నం 1:00 వరకు
వేదిక : Desana Middle school three-round swiss system








