TASC ఆధ్వర్యంలో ‘‘STAR NITE DUSSEHRA DIWALI CELEBRATION ’’
తెలుగు అసోసియేషన్ ఆఫ్ సదరన్ కాలిఫోర్నియా (TASC) దసరా, దీపావళి సెలబ్రేషన్స్ ఘనంగా నిర్వహించేందుకు సన్నద్ధమవుతున్నారు. ఈ సంబరాలు STAR NITE DUSSEHRA DIWALI CELEBRATION అన్న థీమ్ తో జరగనున్నాయి. ఈ మేరకు నిర్వాహకులు చాలా గ్రాండ్ గా ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే సెలబ్రేటీలను, ప్రముఖ సింగర్లను కూడా ఆహ్వానిస్తున్నారు.
ఈ సెలబ్రేషన్స్ అక్టోబర్ 26 న మధ్యాహ్నం 2:30 గంటల నుంచి రాత్రి 10:00 గంటల వరకూ కొనసాగుతాయి. CENTINELA VALLEY CENTRE FOR THE ARTS 14901S INGLEWOOD AVE, LAWNDALE, CA 90260 వేదికగా ఈ గ్రాండ్ సెలబ్రేషన్స్ జరగనున్నాయి.
ఇందులో భాగంగా సాయంత్రం 3:00 గంటల నుంచి సాయంత్రం 5:00 గంటల వరకు దసరా, దీపావళి కల్చరల్ ప్రోగ్రామ్స్, 5:00 నుంచి 5:45 వరకు డిన్నర్, దీని తర్వాత 5:45 నుంచి రాత్రి 10:00 గంటల వరకు స్టార్ నైట్ హంగామా వుంటుంది.ఈ కార్యక్రమానికి గ్రాండ్ స్పాన్సర్ గా డా. ప్రేమ్ రెడ్డి (అడ్వైజరీ కౌన్సిల్ చైర్మన్) వ్యవహరిస్తున్నారు. అలాగే ప్లాటినమ్ స్పాన్సర్ గా ‘‘నవనామి’’ అనే సంస్థ వ్యవహరిస్తోంది. అలాగే స్పాన్సర్ గా హేలియా సిస్టమ్ వుంది.
ఇవి కూడా చదవండి
ప్రెసిడెంట్ కోటి రెడ్డి, కొండల రావు, ఫణి ఉప్పలపర్తి కోశాధికారి, సీతారాం పామిరెడ్డి (ప్రెసిడెంట్ ఎలెక్ట్), అమర్ కేతిరెడ్డి, (పాస్ట్ ప్రెసిడెంట్), మల్లేష్ నూకల (ఈసీ మెంబర్), జ్యోతి (ఈసీ మెంబర్) తదితరుల సమక్షంలో ఈ వేడుకలు జరగనున్నాయి.
ఈ కార్యక్రమానికి వచ్చే స్టార్స్ జాబితా ఇదే..
శివానీ రాజశేఖర్ (నటి)
అశ్వినీ శ్రీ (బిగ్ బాస్ ఫేమ్)
RJ హేమంత్ (తెలుగు స్టాండప్ కమెడియన్
స్ఫూర్తి జితేంద్ర, సింగర్
శ్రావ్య మానస, యాంకర్/ సింగర్
ప్రముఖ ఫోక్ సింగర్ దండేపల్లి శ్రీను కమేరా
ఇంటర్నేషనల్ ఫోక్ సింగర్ డా. కలాశ్రీ భిక్షు నాయక్
మిమిక్రీ ఆర్టిస్ట్ రమేశ్








