లివర్ మోర్ లోని రాగసుధ సభ ఆధ్వర్యంలో ‘‘కర్నాటక సంగీత కచేరీ’’
లివర్ మోర్ లోని రాగసుధ సభ ఆధ్వర్యంలో అద్భుతమైన ‘‘కర్నాటక సంగీత కచేరీ’’ నిర్వహించనున్నారు. ‘‘An evening of Carnatic artistry’’ థీమ్ తో ఈ కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. అక్టోబర్ 25 వ తేదీన ఈ కర్నాటక శాస్త్రీయ సంగీత కచేరీ జరగనుంది.
కాలిఫోర్నియాలోని లాస్ పొసిటాస్ కాలేజ్ ప్రాంగణంలో ఉన్న ప్రముఖ ‘మెర్టెస్ సెంటర్ ఫర్ ది ఆర్ట్స్’ (4000 క్యాంపస్ హిల్ డ్రైవ్, లివర్మోర్, CA 94551) ఈ వేడుకకు వేదిక కానుంది. ఈ ప్రతిష్టాత్మక సంగీత కచేరీలో దేశ విదేశాల్లో ప్రఖ్యాతి గాంచిన పలువురు ప్రముఖ కళాకారులు పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించనున్నారు.
ఈ సంగీత వేడుక మధ్యాహ్నం 2:00 గంటల నుంచి సాయంత్రం 5:00 గంటల వరకు కొన్ని కొన్ని సెషన్లుగా జరుగుతుంది. శాస్త్రీయ సంగీతాన్ని ఇష్టపడే సంగీత రసజ్ఞులు అందరూ తమ తమ కుటుంబీకులతో హాజరుకావాలని రాగసుధ సభ పిలుపునిచ్చింది.
కర్నాటక సంగీత కచేరీలో పాల్గొనే కళాకారుల వివరాలు :
గాత్రం: విద్వాన్ కుమారి కిరణ్ & విద్వాన్ కుమారి నివి (సాయి సిస్టర్స్), మరియు విద్వాన్ శ్రీ కె.ఎస్. విష్ణుదేవ్.
వయొలిన్: విద్వాన్ శ్రీ హెచ్.ఎన్. భాస్కర్, విద్వాన్ శ్రీ అలన్కోడ్ గోకుల్.
మృదంగం: విద్వాన్ శ్రీ పత్రి సతీష్ కుమార్, విద్వాన్ శ్రీ కె.వి. ప్రసాద్.
కంజీర: విద్వాన్ శ్రీ బి. శ్రీ సుందర్‌కుమార్ (అకా కంజీరమన్).
ఘటం: మాస్టర్ సత్య గణేషన్.
మొదటి కచేరీ (మధ్యాహ్నం 2:00 గంటలకు): ప్రముఖ గాయనీమణులు విద్వాన్ కుమారి కిరణ్ మరియు విద్వాన్ కుమారి నివి (సాయి సిస్టర్స్) తమ మధురమైన గాత్రంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. వీరికి వయొలిన్‌పై విద్వాన్ శ్రీ హెచ్.ఎన్. భాస్కర్, మృదంగంపై విద్వాన్ శ్రీ పత్రి సతీష్ కుమార్, మరియు కంజీరపై విద్వాన్ శ్రీ బి. శ్రీ సుందర్‌కుమార్ (కంజీరమాన్) సహకారం అందించనున్నారు.
రెండవ కచేరీ (సాయంత్రం 5:00 గంటలకు): ప్రముఖ గాయకులు విద్వాన్ శ్రీ కె.ఎస్. విష్ణుదేవ్ తన అద్భుతమైన గాత్ర కచేరీతో శ్రోతలను అలరించనున్నారు. ఈ వేడుకలో వయొలిన్‌పై విద్వాన్ శ్రీ అలన్కోడ్ గోకుల్, మృదంగంపై విద్వాన్ శ్రీ కె.వి. ప్రసాద్, మరియు ఘటంపై మాస్టర్ సత్య గణేషన్ తమ ప్రతిభను ప్రదర్శించనున్నారు.
ఈ కార్యక్రమానికి సంబంధించిన స్పాన్సర్‌షిప్‌లు లేదా విరాళాల కోసం ఆసక్తిగలవారు 5104497602, 5104497534, 5104498108 నెంబర్లను సంప్రదించవచ్చు. మరింత సమాచారం కోసం అధికారిక వెబ్సైట్ www.raagasudhasabha.org ను సందర్శించవచ్చు లేదా సోషల్ మీడియా వేదికలైన ఇన్స్టాగ్రామ్, ఫేస్‌బుక్‌లలో raagasudhasabha పేజీ ద్వారా వివరాలు తెలుసుకోవచ్చు.








