22nd October 2026

_________

- Bhuvana

రోజూ అర్ధరాత్రి దాటాక నిద్రపోతున్నారా? ఈ సమస్యలు తెలుసుకోండి! 

రోజూ అర్ధరాత్రి దాటిన తర్వాత నిద్రపోతున్నారా? అలవాటుగా మారిన ఈ లేట్ నైట్ స్లీప్ వల్ల శరీరానికి ఎలాంటి తీవ్రమైన ముప్పు పొంచి ఉందో ఈ రోజే తెలుసుకోండి!

అర్ధరాత్రి దాటినా మెలకువగా ఉండటం వల్ల బిపి (BP) పెరుగుతుంది. రోజూ ఆలస్యంగా నిద్రపోవడం వల్ల గుండె సంబంధిత సమస్యలు మరియు హార్ట్ ఎటాక్ ముప్పు పెరుగుతుంది.

గుండె జబ్బుల ముప్పు

సరిపడా నిద్ర లేకపోవడం వల్ల మెదడులో సెరోటోనిన్ హార్మోన్ తగ్గిపోతుంది. ఇది తీవ్రమైన ఒత్తిడి, ఆందోళన (Anxiety) మరియు డిప్రెషన్‌కు దారితీస్తుంది.

మానసిక ఒత్తిడి & డిప్రెషన్

లేట్ నైట్‌ వరకు మెలకువగా ఉంటే ఆకలిని పెంచే 'గ్రెలిన్' హార్మోన్ ఎక్కువై, రాత్రివేళల్లో అనవసరంగా జంక్ ఫుడ్ తినడం వల్ల బరువు వేగంగా పెరుగుతారు.

బరువు వేగంగా పెరగడం

ఆలస్యంగా నిద్రపోవడం వల్ల శరీరంలో ఇన్సులిన్ నిరోధకత (Insulin Resistance) పెరుగుతుంది. దీనివల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగి టైప్-2 డయాబెటిస్ వస్తుంది.

మధుమేహం ప్రమాదం

రాత్రి సరైన సమయానికి నిద్రపోకపోతే శరీరంలోని సైటోకైన్స్ ఉత్పత్తి తగ్గి, ఇమ్యూనిటీ తీవ్రంగా దెబ్బతింటుంది. దీంతో త్వరగా ఇన్ఫెక్షన్ల బారిన పడతారు.

బలహీనపడే రోగనిరోధక శక్తి

లేట్ నైట్ స్లీప్ వల్ల మహిళల్లో పిసిఓడి (PCOD), క్రమంతప్పిన రుతుక్రమం మరియు థైరాయిడ్ సమస్యలు తలెత్తే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది.

హార్మోన్ల అసమతుల్యత

మనం రాత్రి పడుకున్నప్పుడే మెదడు పాత జ్ఞాపకాలను నిక్షిప్తం చేసుకుంటుంది. ఆలస్యంగా పడుకోవడం వల్ల దృష్టి లోపించడం, మతిమరుపు మరియు ఏకాగ్రత లోపిస్తాయి.

జ్ఞాపకశక్తి తగ్గడం

నిద్రలేమి వల్ల కళ్ల కింద నల్లటి వలయాలు రావడమే కాకుండా, కొల్లాజెన్ తగ్గిపోయి చర్మం త్వరగా ముడతలు పడి చిన్న వయసులోనే పెద్దవారిగా కనిపిస్తారు.

చర్మం ముడతలు & డార్క్ సర్కిల్స్

ఈ రోజు నుంచే రాత్రి 10-11 గంటల మధ్యలోనే పడుకునేలా అలవాటు చేసుకోండి. హాయిగా నిద్రపోండి, సంపూర్ణ ఆరోగ్యాన్ని కాపాడుకోండి!