‘జో జో’ టీమ్..రూరల్ కామెడీ డ్రామా నుంచి ఇంట్రెస్టింగ్ కాషన్ 2 వీడియో రిలీజ్
హీరో, హీరోయిన్ని ప్రేమిస్తానంటాడు.. దానికి బదులుగా
‘‘పడుచు పిల్ల కానొస్తే… ఓ నాలుగు దినాలు వెనక పడి… పని కానిచ్చుకొని… పారిపోయే టైపా?
ఇష్టపడిన పిల్లని దాని బాధ్యతలతో సహా పెళ్ళి చేసుకొని దాన్ని జీవితాంతం మోసెంత గుండకాయ ఉన్న మొగోడి టైపా అని’’ ఆ పిల్ల ప్రశ్నిస్తాది .. దానికి హీరో బదులిస్తూ..
‘‘సత్య ప్రమాణికంగా చెబుతున్నా
ఒకతూరి మాట ఇచ్చినానంటే
మడమ తిప్పని వంశం మాది… బాలయ్య బాబు టైపు’’ అని హీరో గడుసుగా సమాధానం ఇస్తాడు.
హీరోయిన్ మరి హీరోని ప్రేమిస్తాదా! అని తెలియాలంటే మాత్రం ‘జో జో’ సినిమా చూడాల్సిందేనంటున్నారు మేకర్స్. కృష్ణ కమల్ , మహి హీరో హీరోయిన్లుగా రూపొందుతోన్న రూరల్ కామెడీ డ్రామా ‘జో జో’. రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతోన్న ఈ సినిమా ప్రముఖ దర్శకుడు దేవకట్టా సమర్పణలో కిరణ్ జయ్ కుమార్ దర్శకుడిగా రూపొందుతోంది. విజయం బ్యానర్‌పై విజయ్ కృష్ణ లింగమనేని ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన కాషన్ 1కు అమేజింగ్ రెస్పాన్స్ వచ్చింది. ఈ క్రమంలో మేకర్స్.. గురువారం జో జో సినిమా నుంచి కాషన్ 2 వీడియో విడుదల చేశారు.
జొన్నగిరి బ్యాక్‌డ్రాప్‌లో సాగే సినిమా ఇది. మనోభావాల బ్యాచ్ దూరంగా ఉండండంటూ విడుదలైన కాషన్1కు ఏమాత్రం తీసిపోని రేంజ్లో కాసన్ 2 ఉంది. రా రస్టిక్ రొమాంటిక్ మూవీ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. కాషన్ వన్ వీడియోతో సినిమాపై మేకర్స్ క్యూరియాసిటీ క్రియేట్ చేశారు. సినిమాకు సంబంధించి మరికొన్ని వివరాలను త్వరలోనే తెలియజేస్తామని మేకర్స్ తెలిపారు.








