హార్దిక్ పాండ్యాకు భారీ షాక్.. ఐపిఎల్ వరకు కష్టమే..!
భారత స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా(Hardik pandya) అంతర్జాతీయ క్రికెట్‌కు సుదీర్ఘ కాలం పాటు దూరం కానున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం, అతను తీవ్రమైన గాయం కారణంగా రాబోయే కొన్ని నెలల పాటు మైదానంలోకి అడుగుపెట్టే అవకాశం లేదు. అతని గాయం తీవ్రతను పరిశీలిస్తే, తిరిగి ఐపీఎల్ 2027 (IPL 2027) సీజన్ ప్రారంభం వరకు అతను ఎటువంటి పోటీ క్రికెట్ ఆడే అవకాశం లేదని నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.
హార్దిక్ పాండ్యా తన కాలి ఎముక లోపలి భాగంలో ఏర్పడిన ఒత్తిడి గాయానికి బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (CoE) లో పునరావాసం పొందుతున్నాడు. వైద్య బృందం అందించిన అప్డేట్ ప్రకారం, అతను కనీసం లైట్ రన్నింగ్ ప్రారంభించడానికే ఇంకా మూడు వారాల సమయం పడుతుంది. ఆ తర్వాత రన్నింగ్ లోడ్ పెంచుకుంటూ పూర్తి ఫిట్నెస్ సాధించడానికి మరో ఎనిమిది వారాల సుదీర్ఘ సమయం అవసరమవుతుంది. హార్దిక్ కెరీర్ దృష్ట్యా మెడికల్ టీమ్ అతని పునరాగమనంపై ఎలాంటి డెడ్‌లైన్ విధించకుండా, చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తోంది.
ఈ సుదీర్ఘ రికవరీ టైమ్‌లైన్ కారణంగా హార్దిక్ పాండ్యా రాబోయే న్యూజిలాండ్ పర్యటనకే కాకుండా, డిసెంబర్లో జరిగే శ్రీలంక సిరీస్, జనవరిలో జరిగే జింబాబ్వే వన్డే సిరీస్‌లకు కూడా పూర్తిగా దూరమయ్యాడు. అతను కోలుకునే సమయానికి దేశవాళీ టోర్నీలైన సయ్యద్ ముస్తాక్ అలీ, విజయ్ హజారే ట్రోఫీలు కూడా ముగిసిపోతాయి. ఎలాగో అతను టెస్ట్ ఫార్మాట్ ఆడటం లేదు కాబట్టి బోర్డర్-గవాస్కర్ ట్రోఫీతోనూ సంబంధం లేదు. వీటన్నింటినీ బట్టి చూస్తే, హార్దిక్ పాండ్యా మళ్లీ నేరుగా వచ్చే ఏడాది ఐపీఎల్ 2027 లోనే మైదానంలోకి దిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.








