ట్రెడిషనల్ లుక్ లో అదరగొడుతున్న డింపుల్
టాలీవుడ్ అందాల భామ డింపుల్ హయాతి తన స్పెషల్ లుక్తో ఆకట్టుకుంటోంది. సంప్రదాయ ఆభరణాలు, నుదుటిపై బొట్టు, కళ్లు చెదిరే కాటుకతో దేవతా సుందరిలా కనిపిస్తోంది. బ్లాక్ అండ్ వైట్ కలర్ లో దిగిన ఈ ఫొటోలు ఆమె అందాన్ని మరింత ప్రత్యేకంగా ఆవిష్కరిస్తున్నాయి. తలపై అందమైన ఆభరణాలు, ముక్కుపుడక, మెడలో హారాలు, చేతులకు గాజులు ధరించి ట్రెడిషనల్ లుక్లో మెరిసిపోయింది డింపుల్. ముఖ్యంగా ఆమె కళ్లలోని తీక్షణత, ఫేస్ లోని ఎక్స్ప్రెషన్స్ ఫొటోలకు స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలుస్తున్నాయి. మోడ్రన్ లుక్స్తోనే కాకుండా సంప్రదాయ అలంకరణలోనూ తన అందంతో మెప్పించగలనని ఈ ఫొటోలతో ప్రూవ్ చేస్తోంది డింపుల్ హయాతి. ఆమె ఫ్యాన్స్ ను విశేషంగా ఆకట్టుకుంటున్న ఈ సినిమాలు ప్రస్తుతం స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలుస్తున్నాయి.








