విజయదశమి పర్వదినం సందర్భంగా ఎమ్మెల్యే నవీన్ యాదవ్ చేతుల మీదుగా ‘తొలిసారి మిమ్మల్ని చూసింది మొదలు’ సినిమా పోస్టర్ లాంఛ్
కన్నడ చిత్ర పరిశ్రమలో ‘సుప్రీమ్ స్టార్’గా గుర్తింపు తెచ్చుకున్న భార్గవ్ హీరోగా, దర్శకుడిగా తెరకెక్కిస్తున్న కొత్త సినిమా ‘తొలిసారి మిమ్మల్ని చూసింది మొదలు’. ఆరియా మీనన్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని తెలుగు, కన్నడ భాషల్లో రూపొందిస్తున్నారు. కొసల క్రియేటివ్ వర్క్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్‌పై బండి నాగరాజు నిర్మిస్తుండగా.. మద్దినేని రమేష్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ లో ఉంది. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన 70 శాతం చిత్రీకరణ పూర్తి చేశారు. దసరా పర్వదినం సందర్భంగా ఎమ్మెల్యే నవీన్ యాదవ్ చేతుల మీదుగా ‘తొలిసారి మిమ్మల్ని చూసింది మొదలు’ సినిమా పోస్టర్ లాంఛ్ జరిపారు. ఈ సందర్భంగా
ఎమ్మెల్యే నవీన్ యాదవ్ మాట్లాడుతూ – ఈ సినిమా పోస్టర్ లాంఛ్ చేయడం హ్యాపీగా ఉంది. ఇప్పటికే ఈ సినిమా మూడొంతుల షూటింగ్ పూర్తి చేసుకుంది. డిసెంబర్ లో ప్రేక్షకుల ముందుకు ఈ మూవీ రాబోతోంది. హీరో, డైరెక్టర్ భార్గవ్, ప్రొడ్యూసర్ నాగరాజు తో పాటు ఈ మూవీ కోసం కష్టపడుతున్న టీమ్ అందరికీ నా బెస్ట్ విశెస్ అందిస్తున్నా. ఈ సినిమా ఎలాంటి ఆటంకాలు లేకుండా పూర్తి చేసుకుని ప్రేక్షకుల ముందుకొచ్చి మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నా అన్నారు.
ప్రొడ్యూసర్ బండి నాగరాజు మాట్లాడుతూ – ఈ రోజు మా చిత్ర పోస్టర్ ను ఎమ్మెల్యే నవీన్ యాదవ్ గారు లాంఛ్ చేసి మాకు బెస్ట్ విశెస్ అందించడం సంతోషంగా ఉంది. మంచి క్వాలిటీతో ప్రొడక్షన్ పరంగా ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాం. ప్రేక్షకులు కోరుకునే అన్ని అంశాలు మా సినిమాలో ఉంటాయి. యూత్ తో పాటు ఫ్యామిలీ ఆడియెన్స్ మా సినిమాను ఎంజాయ్ చేయవచ్చు. డిసెంబర్ లో మా సినిమాను గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు తీసుకొస్తాం అన్నారు.
డైరెక్టర్, హీరో భార్గవ్ మాట్లాడుతూ – ‘తొలిసారి మిమ్మల్ని చూసింది మొదలు’ సినిమాతో తెలుగు ఆడియెన్స్ ముందుకు దర్శకుడిగా, హీరోగా వస్తున్నాను. ఈ అవకాశం కల్పించిన మా ప్రొడ్యూసర్ కు థ్యాంక్స్. మా టీమ్ అందరి సపోర్ట్ తో ఒక మంచి యూత్ ఫుల్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్ సినిమా రూపొందిస్తున్నాను. షూటింగ్ మేము అనుకున్నట్లు బాగా జరుగుతోంది. మూవీ క్వాలిటీ, ఔట్ పుట్ తో సంతృప్తిగా ఉన్నాం. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి డిసెంబర్ లో మా సినిమాను రిలీజ్ కు తీసుకొస్తాం అన్నారు.








