తేజ సజ్జా పెళ్లిపై ఇంట్రెస్టింగ్ టాక్.. నవంబర్‌లో ఎంగేజ్మెంట్, డిసెంబర్లో పెళ్లి?
టాలీవుడ్లో వరుసగా వినిపిస్తున్న యంగ్ హీరోల పెళ్లి వార్తలు ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ డిస్కషన్ కు తెరతీశాయి. హనుమాన్ సినిమాతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరో తేజ సజ్జా(Teja sajja) త్వరలోనే వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతున్నారనే వార్త ఫిల్మ్ నగర్ వర్గాల్లో వినిపిస్తోంది. చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ ను ప్రారంభించిన తేజ.. హీరోగా తనదైన గుర్తింపు సంపాదించుకున్నారు. హనుమాన్ తో పాన్ ఇండియా స్థాయిలో సత్తా చాటిన ఆయన, మిరాయ్ తోనూ ప్రేక్షకుల్లో మంచి క్రేజ్‌ను సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం సినిమాలతో పాటు ది ట్రైటర్స్ తెలుగు రియాలిటీ షోతోనూ ఆడియన్స్ ను అలరిస్తున్న ఈ యంగ్ హీరో పెళ్లి వార్త ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
తాజా ప్రచారం ప్రకారం.. తేజ సజ్జా పెళ్లి కి సంబంధించి ఇరు కుటుంబాల మధ్య చర్చలు జరుగుతున్నాయని తెలుస్తోంది. ఈ ఏడాది నవంబర్‌లో ఎంగేజ్మెంట్ చేసి, డిసెంబర్లో పెళ్లి జరపాలని కుటుంబ సభ్యులు భావిస్తున్నట్లు సమాచారం. అంతేకాకుండా, ఈ పెళ్లి వేడుకను రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యులు, స్నేహితుల సమక్షంలో ఘనంగా నిర్వహించనున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే, ఈ డేట్స్, వెన్యూ కి సంబంధించి ఎలాంటి అఫీషియల్ కన్ఫర్మేషన్ వెలువడలేదు.
ఇక తేజ సజ్జా కాబోయే జీవిత భాగస్వామి ఎవరనే విషయంపై కూడా ఆసక్తి నెలకొంది. ఇండస్ట్రీ వర్గాల్లో జరుగుతున్న ప్రచారం ప్రకారం.. ఆమె సినీ ఇండస్ట్రీకి చెందిన వ్యక్తి కాదని, సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నారని తెలుస్తోంది. గత కొంతకాలంగా వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని, కుటుంబ సభ్యుల అంగీకారంతో పెళ్లి కి సిద్ధమవుతున్నారని టాక్ వినిపిస్తోంది. అయితే, ఈ వార్తలపై తేజ సజ్జా ఇప్పటివరకు స్పందించలేదు. దీంతో ఆయన పెళ్లి వార్తల్లో నిజానిజాలు తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.








