విజయవాడ ఉత్సవ్-2.0లో మెగా కార్నివాల్ ప్రారంభించిన సీఎం చంద్రబాబు
విజయవాడ ఉత్సవ్-2.0లో భాగంగా నిర్వహించే మెగా కార్నివాల్ ను ప్రారంభించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.
శంఖాన్ని పూరించి సాంస్కృతిక కవాతుకు స్వాగతం పలికిన నిర్వాహాకులు.
విజయవాడ ఉత్సవ రథంతో కార్నివాల్ మొదలు… కాకరపర్రు, కడియం పూలతో ఉత్సవ రథం అలంకరణ.
వివిధ రకాల పూలతో అమ్మవారి చిత్రాన్ని అలకరించి రథాన్ని తీర్చిదిద్దిన నిర్వాహాకులు.
గుర్రాలు, ఒంటెలతో కార్నివాల్ లో కళాకారుల ప్రదర్శన.
కార్నివాల్ లో ఆకర్షణగా నిలిచిన డప్పు, సన్నాయి వాయిద్యాల బృందాలు… గరడి కళాకారులు
సంస్కృతి, సంప్రదాయం, కళా వైభవం, ఐక్యత, చరిత్రను చాటి చెప్పేలా మెగా కార్నివాల్.
కవాతులో పాల్గొన్న కళా బృందాలకు అభివాదం చేస్తోన్న ముఖ్యమంత్రి.
బేతాళం సెట్ కళారూపాలను ఆసక్తిగా తిలకించిన విజయవాడ వాసులు.
మెగా కార్నివాల్ సందర్భంగా సందడిగా మారిన ఏలూరు రోడ్.
కార్నివాల్ లో వివిధ కళారూపాలను సెల్ ఫోన్లల్లో చిత్రకరిస్తూ కేరింతలు కొడుతున్న స్థానికులు.
ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ…
• కళలు, సంస్కృతి చాటి చెప్పేలా విజయవాడ ఉత్సవ్ నిర్వహించారు.
• పర్యాటకం, స్థానిక కళాకారులు, చేతి వృత్తుల వారికి అవకాశాల కల్పించేలా విజయవాడ ఉత్సవ్ నిర్వహించడం సంతోషంగా ఉంది.
• ఓ పక్క విజయవాడ ఉత్సవ్… మరోవైపు జాతీయ స్థాయిలో సరస్ మేళాను నిర్వహించారు. దీంతో విజయవాడకు ప్రత్యేక కళ వచ్చింది.
• సోషల్ మీడియాలో ఎక్కువ సమయం కేటాయించడం కంటే… ఇలాంటి ఉత్సవాల్లో పాల్గొంటే ఉల్లాసంగా ఉంటుంది.
• మన సంస్కృతే మన ఉనికికి పునాది.
• టెక్నాలజీతో టెన్షన్ వస్తుంది… ఆ టెన్షన్ పోవాలంటే ఆధ్యాత్మికతను పాటించాలి.
• ఆధ్యాత్మికతతో మన మనస్సులను జయించవచ్చు.
• మానసికోల్లాసాన్ని పెంచేలా విజయవాడ ఉత్సవ్ వంటివి కార్యక్రమాలు నిర్వహించుకోవాలి.
• గతేడాది కంటే 2 లక్షల మంది ఎక్కువగా దసరా సందర్భంగా దుర్గమ్మను దర్శించుకున్నారు.
• విజయవాడ ఉత్సవ్-2.0కు తమిళనాడు, మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన ఇద్దరు సీఎంలు వచ్చారు.
• మన కళలు, సంప్రదాయం, తెలుగు వైభవనాన్ని ప్రపంచానికి చాటి చెప్పాలి.
• రెండేళ్ల క్రితం ఉత్సవాలే లేవు.. 2024కు ముందు రాష్ట్రంలో ఎక్కడా చూసినా అశాంతే ఉండేది.
• సంక్షేమం అందిస్తున్నాం… అభివృద్ధి చేస్తున్నాం.. సుపరిపాలనతో సేవలు అందిస్తున్నాం.
• కరవును జయించే శక్తి ఇవ్వాలని దుర్గమ్మను కోరాను.
• ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని హెల్తీ, వెల్తీ, హ్యాపీ సొసైటీగా తీర్చిదిద్దుతాం.
• విజయవాడ ఉత్సవ్-2.0ను సక్సెస్ చేసిన విజయవాడ వాసులకు అభినందనలు.
• శభాష్ విజయవాడ.








