విద్యార్థుల్లో కొత్త ఉత్సాహం… ముగిసిన నాలుగు వారాల చెస్ శిక్షణా శిబిరం
విద్యార్థుల్లో వున్న ప్రతిభను వెలికి తీయడానికి, బుర్రకు పదును పెట్టడానికి తానా మిడ్ అట్లాంటిక్ ఆధ్వర్యంలో నాలుగు వారాల పాటు చెస్ శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ శిక్షణా శిబిరం ముగింపు సందర్భంగా విద్యార్థులకు ప్రత్యేకంగా చెస్ టోర్నమెంట్‌ను నిర్వహించారు. ఈ పోటీల్లో ప్రతిభ కనబరిచిన విజేతలకు ట్రోఫీలను అందజేయడంతో పాటు, శిక్షణను విజయవంతంగా పూర్తి చేసిన విద్యార్థులందరికీ కోర్సు పూర్తి చేసినట్లుగా సర్టిఫికేట్స్ కూడా ప్రదానం చేశారు.

ఈ కార్యక్రమం ఇంత సక్సెస్ కావడానికి ముందుండి నడిపించి, అద్భుతమైన నాయకత్వ పటిమ, అంకితభావంతో సమన్వయం చేసిన వ్యోమ్ క్రొత్తపల్లి, రోహణ్ గూడూరు మరియు ప్రణవ్ కంతేటీని నిర్వాహకులు ప్రత్యేకంగా అభినందించారు.

అలాగే, విద్యార్థులకు అమూల్యమైన చెస్ మెళకువలను నేర్పించి మార్గదర్శనం చేసిన జాషువా ఆండర్సన్, ట్రై-బ్రిడ్జెస్ చెస్ క్లబ్‌లకు మరియు యువత విద్యాభివృద్ధికి తోడ్పడే ఇటువంటి కార్యక్రమాలను నిరంతరం ప్రోత్సహిస్తున్న తానా కేంద్ర నాయకత్వానికి ఈ సందర్భంగా నిర్వాహకులు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.

కార్యక్రమంలో పాల్గొని ప్రతిభ చాటిన విద్యార్థులందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ, ఈ శిక్షణా కార్యక్రమం దిగ్విజయంగా పూర్తి కావడానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ తానా మిడ్-అట్లాంటిక్ టీమ్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసింది.








