అమెరికాలో ఘనంగా వెటా ఆధ్వర్యంలో సద్దుల బతుకమ్మ వేడుకలు
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకైన సద్దుల బతుకమ్మ వేడుకలను ఉమెన్ ఎంపవర్మెంట్ తెలుగు అసోసియేషన్ (WETA) ఆధ్వర్యంలో అమెరికాలోని సాన్ రామన్లో అక్టోబర్ 17, 2026న ఘనంగా నిర్వహించారు. విదేశాల్లో నివసిస్తున్న తెలుగువారిని ఒక్కచోట చేర్చి తెలంగాణ సంప్రదాయాలను చాటిచెప్పేలా వేడుకలను ఉత్సాహంగా జరుపుకున్నారు.
ఈ కార్యక్రమానికి తెలంగాణ నుంచి ముఖ్య అతిథిగా కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి హాజరయ్యారు. మహిళలు సంప్రదాయ దుస్తుల్లో పాల్గొని బతుకమ్మలను అందంగా అలంకరించి, పాటలు పాడుతూ వేడుకలను వైభవంగా నిర్వహించారు.
సాన్ రామన్లోని విండ్మియర్ రాంచ్ మిడిల్ స్కూల్లో మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు ఈ వేడుకలు కొనసాగాయి. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను విదేశాల్లోనూ భావితరాలకు పరిచయం చేయడంలో WETA తన వంతు కృషి చేసింది.








