పుట్టినరోజులు, పెళ్లి రోజులు లేదా ప్రత్యేక వేడుకల్లో ప్రియమైన వారికి ఏ బహుమతి ఇవ్వాలో ఆలోచిస్తున్నారా? ఎప్పటికీ పచ్చగా ఉండే అందమైన మొక్కలను బహుమతిగా ఇస్తే ఆ జ్ఞాపకం ఎల్లప్పుడూ నిలిచిపోతుంది!
ఇంట్లో సానుకూల శక్తిని, అదృష్టాన్ని తెస్తుందని నమ్మే లక్కీ బాంబూ మొక్కను చిన్న గాజు పాత్రలో అందంగా అమర్చి బహుమతిగా ఇస్తే అందరూ ఎంతో ఇష్టపడతారు.
లక్కీ బాంబూ
ఆకర్షణీయమైన తెల్లని పూలతో, ఇళ్లలోని గాలిని శుద్ధి చేసే గుణం ఉన్న పీస్ లిల్లీ మొక్క గృహప్రవేశం వంటి శుభకార్యాలకు అత్యుత్తమ బహుమతి.
శాంతినిచ్చే పీస్ లిల్లీ
వాస్తు ప్రకారం సంపదకు ప్రతీకగా భావించే జేడ్ ప్లాంట్‌ను అందమైన కుండీలో పెట్టి బహుమతిగా ఇస్తే, ఇటు ఇంటర్నెట్ డెకరేషన్‌కు అటు శుభానికి రెండూ కుదురుతాయి.
అందమైన జేడ్ ప్లాంట్
ఎక్కడైనా సులభంగా పెరిగే మనీ ప్లాంట్‌ను అందమైన గ్లాస్ బాటిల్స్ లేదా కలర్ ఫుల్ పాట్స్‌లో పెట్టి బహుమతిగా ఇవ్వడం ఎప్పుడూ ట్రెండ్‌లోనే ఉంటుంది.
మనీ ప్లాంట్
రంగు రంగుల పూలతో ఎంతో అందంగా కనిపించే కలంకోయి మొక్కలను బహుమతిగా ఇస్తే, అవి చూసేవారి మొఖంలో వెంటనే చిరునవ్వును తెప్పిస్తాయి.
కలంకోయి మొక్క
తక్కువ నిర్వహణ అవసరమయ్యే స్నేక్ ప్లాంట్ రాత్రి పూట కూడా ఆక్సిజన్‌ను ఇస్తుంది. ఆఫీస్ డెస్క్ లేదా బెడ్రూమ్లో పెట్టుకోవడానికి ఇది పర్ఫెక్ట్ గిఫ్ట్.
స్నేక్ ప్లాంట్
చిన్న చిన్న కుండీలలో ఉండే ముద్దుముద్దుల సుక్క్యులెంట్ మొక్కలు చూడటానికి బొమ్మల్లా ఉంటాయి. ఇవి టేబుల్ డెకరేషన్‌కు బెస్ట్ ఆప్షన్.
రంగుల సుక్క్యులెంట్స్
మొక్క ఇచ్చిన కుండీపై మీ ప్రియమైన వారి పేర్లు లేదా అందమైన కొటేషన్లు పెయింట్ చేసి ఇస్తే ఆ బహుమతి విలువ మరింత పెరుగుతుంది.
వ్యక్తిగత స్పర్శ
ఎప్పటికీ వాడిపోని ఈ పచ్చని మొక్కలను బహుమతిగా ఇచ్చి, మీ బంధాలను మరింత పదిలంగా, ఆరోగ్యకరంగా మార్చుకోండి!