సెయింట్ లూయిస్ లో తానా ఆధ్వర్యంలో ‘‘టీమ్ స్క్వేర్ 5కే రన్’’
వాషింగ్టన్ : అమెరికాలోని సెయింట్ లూయిస్ లో తానా (TANA)టీమ్ స్క్వేర్ ఆధ్వర్యంలో 5k వాక్/రన్ కార్యక్రమం నిర్వహించారు. సామాజిక సేవే లక్ష్యంగా, ఆరోగ్యంపై అవగాహన కల్పిస్తూ, ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రోత్సహించేందుకు ఈ రన్ నిర్వహించారు. దాదాపు 200 మంది తెలుగు వారు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
తెలుగు వారి మధ్య ఐక్యతను పెంపొందించడంతో పాటు సామాజిక సేవా కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరినీ భాగస్వాములను చేయడమే లక్ష్యంగా ఈ ఈవెంట్ రూపొందించామని నిర్వాహకులు ప్రకటించారు. చిన్నారులు, పెద్దలు అనే తేడా లేకుండా సుమారు 200 మంది పాల్గొనడం ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రోత్సహిస్తూ, సామాజిక బాధ్యతను చాటుతూ టీమ్ స్క్వేర్ నిర్వహించిన ఈ కార్యక్రమానికి తెలుగు సమాజం నుంచి విశేష స్పందన లభించింది.

తెలుగు ప్రజల మధ్య ఐక్యతను పెంపొందించడం, సామాజిక సేవా కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరినీ భాగస్వాములను చేయడం వంటి గొప్ప లక్ష్యాలతో నిర్వహించిన ఈ 5K వాక్/రన్ కార్యక్రమం అందరికీ స్ఫూర్తిదాయకంగా నిలిచింది. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన తానా టీమ్ స్క్వేర్ నిర్వాహకులకు, వాలంటీర్లకు, సహకరించిన నాయకులతోపాటు పాల్గొన్న ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక అభినందనలు, ధన్యవాదాలు తెలిపారు.
ఇవి కూడా చదవండి
ఈ కార్యక్రమంలో తానా ఫౌండేషన్ ట్రస్టీ రాజా సూరపనేని, తానా రీజినల్ కో ఆర్డినేటర్ రవి పుట్లూరు, మహిళా కో ఆర్డినేటర్ పల్లవి సూరపనేని, గ్లోబల్ ఎన్ఆర్ఐ టీడీపీ ఆర్గనైజింగ్ సెక్రెటరీ చెంచు వేణుగోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.








