చూడటానికి అచ్చం చిన్న చిన్న రాళ్లలా, గులకరాళ్లలా కనిపిస్తాయి.. కానీ ఇవి నిజమైన ప్రాణం ఉన్న మొక్కలు! ఆసక్తికరమైన 'మొక్కలు 'గురించి చూద్దాం!
రెండు కలిసిన రాళ్లలా కనిపించే ఆకులు ఉంటాయి. కొన్ని రకాలలో తెలుపు లేదా పసుపు పూలు పూస్తాయి.
లిథాప్స్
గుండ్రని, మందమైన ఆకులు రాళ్ల ముక్కల్లా కనిపిస్తాయి. కొన్ని రకాలలో పెద్ద పువ్వులు పూస్తాయి.
ప్లియోస్పిలోస్
గుండ్రంగా, మందంగా ఉండే ఆకులు చిన్న రాళ్లలా కనిపిస్తాయి. కొన్ని రకాల ఆకులు బూడిద లేదా లేత ఆకుపచ్చ రంగులో ఉంటాయి.
గిబ్బేయం
లిథాప్స్‌ను పోలిన జత ఆకులు, వాటిపై ప్రత్యేకమైన మచ్చలు ఉంటాయి. చిన్న రాళ్ల మధ్య దాగినట్టుగా కనిపిస్తుంది.
డింటెరాంథస్
మందమైన, కోణాల్లాంటి ఆకులు రాళ్ల ముక్కలను పోలి ఉంటాయి. సరైన పరిస్థితుల్లో పసుపు పూలు కూడా పూస్తాయి.
లాపిడారియా
తెల్లటి కాగితం పొరల్లా కనిపించే చిన్న ఆకుల పొరలతో దీని కాండాలు ప్రత్యేకంగా కనిపిస్తాయి. ఇది రాయిలాంటి రూపం కంటే విచిత్రమైన ఎడారి మొక్కగా ప్రసిద్ధి.
అవోనియా
చిన్న గుండ్రని బంతిలా కనిపిస్తుంది. రాయి లేదా బంతిలా ఉన్న దీని ఆకారం వల్ల కలెక్షన్ ప్లాంట్‌గా ఆకట్టుకుంటుంది.
యుఫోర్బియా ఒబేసా
చిన్నగా, బూడిదరంగు రాతి ఆకృతిలో కనిపించే అరుదైన కాక్టస్ జాతి. పెరుగుదల చాలా నెమ్మదిగా ఉంటుంది.
అజ్టేకియం
చిన్న వేళ్లలా కనిపించే ఆకుల చివరలు పారదర్శకంగా ఉంటాయి. చిన్న కుండీల్లో పెంచుకోవచ్చు.
ఫెనెస్ట్రేరియా
చూసేవారిని మోసం చేసేలా, ప్రకృతి సృష్టించిన ఈ అద్భుతమైన 'జీవించే రాళ్ల' మొక్కలను మీ ఇంట్లో పెంచి అందరినీ ఆశ్చర్యపరచండి!