స్వరోవ్స్కీ దీపావళి క్యాంపెయిన్‌లో రష్మిక గ్లామర్!
2016లో కిరిక్ పార్టీతో నటిగా పరిచయమైన రష్మిక తెలుగు లో ఛలో సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. గీత గోవిందం, సరిలేరు నీకెవ్వరు, పుష్ప ఫ్రాంచైజీ, యానిమల్ వంటి సినిమాలతో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్న ఈ బ్యూటీ, తన అందం, అభినయంతో అభిమానులను ఆకట్టుకుంటోంది. తాజాగా రష్మిక మందన్నా స్వరోవ్స్కీ దీపావళి క్యాంపెయిన్ 2026లో తనదైన గ్లామర్‌తో మెరిసిపోయింది. పింక్ కలర్ శారీలో క్రిస్టల్ నెక్లెస్‌లు, బ్యాంగిల్స్, రింగ్స్, స్టేట్మెంట్ ఇయర్ కఫ్స్‌తో సంప్రదాయ అందానికి మోడ్రన్ టచ్ ఇచ్చింది. ఈ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేయగా, వాటిని నెటిజన్లు తెగ వైరల్ చేస్తున్నారు.








