హ్యూస్టన్ పరిసర ప్రాంతాల్లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక, తెలంగాణ ఆడపడుచుల నిలువెత్తు రూపం బతుకమ్మ పండగును అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రం హ్యూస్టన్ పరిసర ప్రాంతాలైన కేటీ, ఫుల్షయర్ లో మహిళలు ఎంతో ఉత్సాహంగా జరుపుకున్నారు. మహిళలు సంప్రదాయ దుస్తులు ధరించి, రంగురంగుల పూలతో బతుకమ్మలను తయారు చేశారు. వాటిని వివిధ రకాల పూలతో అందంగా అలంకరించారు. గౌరమ్మను పూజిస్తూ, బతుకమ్మ పాటలు పాడుతూ, చప్పట్లో లయబద్ధంగా ఆడారు.
ఇవి కూడా చదవండి
బతుకమ్మ తొలి రోజు ఎంగిలి పూల బతుకమ్మ. ఈ ఎంగిలి పూల బతుకమ్మకు ఎంతో ప్రాధాన్యత కూడా వుంది. దీనిని విదేశాలలో కూడా నిర్వహిస్తూ వున్నారు. మహిళలతో పాటు చిన్నారులు కూడా బతుకమ్మ పాటలు పాడుతూ, ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ బతుకమ్మ సెలబ్రేషన్స్ ద్వారా తమ కుటుంబాల మధ్య సంబంధాలు మరింత దగ్గరయ్యాయని మహిళలు ఆనందం వ్యక్తం చేశారు.








