ఏఐఏ ఆధ్వర్యంలో దసరా, దీపావళి ధమాకా 2026… మీడియా పార్ట్నర్గా ‘తెలుగు టైమ్స్’
అమెరికాలో ప్రవాస భారతీయుల సంస్కృతీసంప్రదాయాలను చాటిచెప్పేలా అసోసియేషన్ ఆఫ్ ఇండో అమెరికన్స్ (AIA), బోల్లీ 92.3 ఎఫ్ఎం (Bolly 92.3 FM) ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా నిర్వహించనున్న దసరా దీపావళి ధమాకా 2026(Dussehra Diwali Dhamaka 2026) వేడుకలకు సర్వం సిద్ధమైంది. ఈ చారిత్రక వేడుకలకు ప్రముఖ ఎన్నారై తెలుగు పత్రిక ‘తెలుగు టైమ్స్'(Telugu Times) అధికారిక మీడియా పార్ట్నర్గా వ్యవహరిస్తుండటం విశేషం.
వేడుకల వివరాలు:
తేదీ: అక్టోబర్ 17, 2026 (శనివారం)
సమయం: మధ్యాహ్నం 12:00 గంటల నుండి రాత్రి 11:00 గంటల వరకు
వేదిక: అలమేడా కౌంటీ ఫెయిర్‌గ్రౌండ్స్, ప్లెజంటన్, కాలిఫోర్నియా (Alameda County Fairgrounds, Pleasanton, CA)
కార్యక్రమ ప్రత్యేకతలు…
ఈ వేడుకల్లో భాగంగా రెండు వేదికలపై నాన్‌స్టాప్ సాంస్కృతిక కార్యక్రమాలు, రామలీల ప్రదర్శన, డిస్కో డాండియా, భారీ బాణసంచా కాల్పులు, , ఆకట్టుకునే రీతిలో 40 అడుగుల రావణ దహనం (Ravan Dehan) కార్యక్రమం నిర్వహించనున్నారు. అలాగే, రథయాత్ర, సింధూర్ ఖేలా, మహా మంగళహారతి, 10 అడుగుల దుర్గాదేవి విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి.
ఇవి కూడా చదవండి
వీటితో పాటుగా:
ఉచిత ఆరోగ్య శిబిరం (Free Health Fair – సౌత్ ఏషియన్ హార్ట్ సెంటర్ సహకారంతో)
చెస్ & క్యారమ్స్ పోటీలు, ఏఐఏ ఐడల్ (సింగింగ్), అంతాక్షరి
25కి పైగా ఫుడ్ బూత్‌లు , 150కి పైగా షాపింగ్ వెండర్ స్టాల్స్
పిల్లల కోసం ప్రత్యేక కార్నివాల్ రైడ్స్ ఏర్పాటు చేశారు.
ప్రవాస తెలుగు సమాజానికి ఎప్పటికప్పుడు తాజా వార్తలు, వేడుకల సమాచారాన్ని అందిస్తూ అగ్రగామిగా ఉన్న తెలుగు టైమ్స్ మీడియా పార్ట్నర్గా వ్యవహరిస్తున్న ఈ మహా వేడుకలకు తెలుగువారందరూ కుటుంబసమేతంగా తరలివచ్చి విజయవంతం చేయాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు.








