పియర్ల్యాండ్ శ్రీ మీనాక్షి టెంపుల్ లో నవంబర్ 16 నుంచి డిసెంబర్ 26వరకు అయ్యప్ప మండల పూజలు
అమెరికాలోని పియర్ల్యాండ్ శ్రీ మీనాక్షి ఆలయంలో (Sri Meenakshi Temple, Pearland TX)అయ్యప్ప స్వామి మండల పూజలు అత్యంత వైభవంగా, భక్తి శ్రద్ధలతో నిర్వహించనున్నారు. ఈ మేరకు అయ్యప్ప మండల పూజలకు సంబంధించిన కార్యక్రమాల షెడ్యూల్ ను దేవస్థానం విడుదల చేసింది. నవంబర్ 16 నుంచి డిసెంబర్ 26 వ తేదీ వరకూ అంటే.. మొత్తం 41 రోజుల పాటు పవిత్రమైన మండల పూజలు జరగనున్నాయి.
అయితే.. ఈ మండల పూజలు నవంబర్ 15 న ప్రత్యేక కార్యక్రమాలతో ప్రారంభం అవుతున్నాయి. ఉదయం 10:00 గంటలకు ‘‘సప్త శుద్ధి అభిషేకం’’ తో ఈ అంకురార్పణ జరగనుంది.
ఇక.. ప్రతి రోజూ నవంబర్ 16 నుంచి డిసెంబర్ 26 వ తేదీ వరకూ ప్రతి రోజూ ఉదయం 9:00 గంటల నుంచి రాత్రి 8:30 గంటల వరకు అభిషేకం, మాలర్ నివేదన, ఉషపూజ, దీపారాధన, సహస్రనామ అర్చన, హరివరాసనం వంటి కార్యక్రమాలు వుంటాయి.
అష్టాభిషేకం: నవంబర్ 21, నవంబర్ 28, డిసెంబర్ 5, డిసెంబర్ 12, డిసెంబర్ 19 మరియు డిసెంబర్ 26 తేదీలలో ఉదయం 10:00 గంటలకు ప్రత్యేక అష్టాభిషేక పూజలు ఉంటాయి.
ప్రత్యేక పూర్తి రోజు వేడుకలు: నవంబర్ 28, 2026న ఉదయం 8:30 నుండి రాత్రి 8:30 వరకు ‘అఖండనామ జపం’ మరియు ‘అన్నదానం’ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడుతుంది.
మండల పూజ ముగింపు (డిసెంబర్ 26): డిసెంబర్ 26, 2026న ఉదయం 9:00 గంటలకు ఘీ అభిషేకం, 10:30 గంటలకు కలభాభిషేకం, దీపారాధన మరియు ఊరేగింపు ఉంటాయి. సాయంత్రం 5:00 గంటలకు ఆభరణాల ఊరేగింపు, ఆభరణ చార్టు, దీపారాధన, పుష్పాభిషేకం నిర్వహించి, రాత్రి హరివరాసనంతో ఈ మండల పూజలు ముగుస్తాయి.
ఇక.. ఈ మండల పూజలో గానీ, అయ్యప్ప దీక్షాధారణ సమయంలో ‘‘పడిపూజ’’ అనేది అత్యంత విశేషమైంది. దీనిని అత్యంత విశేషమైన పూజగా స్వాములు భావిస్తారు.ఈ నేపథ్యంలోనే పడి పూజ తేదీలు: నవంబర్ 28, డిసెంబర్ 12, డిసెంబర్ 19 మరియు జనవరి 9 తేదీలలో సాయంత్రం 6:30 గంటలకు పడి పూజలు నిర్వహించబడతాయి. భక్తులందరూ ఈ పవిత్ర పూజా కార్యక్రమంలో పాల్గొని అయ్యప్ప స్వామి కృపకు పాత్రులు కావాల్సిందిగా ఆలయ నిర్వాహకులు కోరుతున్నారు.
మరిన్ని వివరాల కోసం లేదా స్పాన్సర్షిప్ వివరాల కోసం [email protected] సంప్రదించవచ్చు.
అలాగే ఈ 41 రోజుల పాటు గ్రాండ్ స్పాన్సర్ గా అవ్వాలనుకునేవారు 1,001 డాలర్లు గా నిర్ణయించారు. అలాగే అన్నదానం కోసం 75 డాలర్లు, నిత్య పూజ స్పాన్సర్ అయితే 251 డాలర్లుగా దేవస్థానం నిర్ణయించింది.
అయితే.. ఈ కార్యక్రమాలన్నీ కూడా దేవస్థానం చైర్మన్ కుమార్ భాష్యం ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. అలాగే విజయరాణి చిలుకూరి (కార్యదర్శి), సేతురామన్ రామన్ (ట్రెజరర్) సహాయ సహకారాలు అందిస్తున్నారు.







