ప్రజాస్యామాన్ని రాహుల్ కించపరుస్తున్నారు : ఎంపీ ఈటల
ఎన్నికల సంఘం (Election Commission), సుప్రీం కోర్టు (Supreme Court) వ్యవస్థల్ని అపహాస్యం చేసేలా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) మాట్లాడుతున్నారని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ (Etela Rajender) విమర్శించారు. భారతదేశం అతిగొప్ప ప్రజాస్వామిక దేశమని నెహ్రూ (Nehru) నుంచి నేటి వరకు చెబుతున్నారని, కానీ, రాహుల్ మాత్రం ప్రజాస్వామ్యాన్ని కించపరుస్తూ నియంతృత్వ దేశమని ఆరోపణలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఇదే ఈసీ వ్యవస్థ, ఇదే సుప్రీం కోర్టు ఆనాటి నుంచి ఉందని గుర్తించాలన్నారు. చివరికి సైనికులను కూడా రాహుల్ కించపరుస్తున్నారని అన్నారు. ఎక్కడా స్కామ్‌లు, అవినీతి లేకుండా దేశం గర్వించేలా ప్రధాని మోదీ పాలన కొనసాగిస్తున్నారని స్పష్టం చేశారు.







