‘భారత్ సమ్మిట్’లో పాల్గొన్న హనుమాండ్ల ఝాన్సీ రాజేందర్ రెడ్డి!
హైదరాబాద్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ‘భారత్ సమ్మిట్ – ఫోర్జింగ్ ఎ న్యూ వరల్డ్’ కార్యక్రమంలో టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్, WETA ఫౌండర్, అధ్యక్షురాలు హనుమాండ్ల ఝాన్సీ రాజేందర్ రెడ్డి పాల్గొని ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ సమ్మిట్లో రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, పలువురు మంత్రులతో కలిసి ఆమె ఈ వేడుకలో పాలుపంచుకున్నారు.
ఈ సమ్మిట్లో భాగంగా నిర్వహించిన వివిధ సమావేశాలు, చర్చా వేదికల్లో ఆమె పాల్గొని, అంతర్జాతీయ స్థాయిలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితులు, సామాజిక అభివృద్ధి, మహిళా సాధికారత, అలాగే భవిష్యత్తు ప్రపంచ నిర్మాణం వంటి కీలక అంశాలపై జరిగిన చర్చలను ఎంతో ఆసక్తిగా పరిశీలించారు. ఈ అంతర్జాతీయ సదస్సుకు దేశ విదేశాల నుండి పలువురు ప్రముఖులు, వివిధ రంగాలకు చెందిన నిపుణులు , ప్రతినిధులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.







