హైదరాబాద్‌ను సేఫ్‌సిటీగా తీర్చిదిద్దటమే లక్ష్యం: నగర పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్
హైదరాబాద్: నగర పోలీస్ కమిషనర్‌గా సీనియర్ ఐపీఎస్ అధికారి మహేష్ మురళీధర్ భగవత్ బాధ్యతలు చేపట్టారు.ఈ సందర్భంగా ఆయన శాంతిభద్రతల పరిరక్షణ, మహిళల భద్రత, సైబర్ నేరాల నియంత్రణకు అత్యంత ప్రాధాన్యత ఇస్తామని, హైదరాబాద్‌ను సేఫ్‌సిటీగా తీర్చిదిద్దేందుకు ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు చెప్పారు. శుక్రవారం బంజారాహిల్స్‌లోని తెలంగాణ ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్లో సీపీగా బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఆర్గనైజ్డ్ క్రైమ్ గ్యాంగులు, గ్రూపు తగాదాలు, ప్రతీకార దాడులను అరికట్టేందుకు ప్రత్యేక ప్లాన్ రూపొందిస్తామని తెలిపారు.
ముందుగా డీసీపీలు, ఏసీపీలతో సమావేశమై, తర్వాత అన్ని పోలీస్ స్టేషన్లను విజిట్ చేస్తానని చెప్పారు. ముఖ్యంగా సాయంత్రం, రాత్రి వేళల్లో నేరాలు జరగకుండా సిబ్బంది పోలీస్ స్టేషన్లకే పరిమితం కాకుండా రోడ్లపైకి వచ్చి పెట్రోలింగ్ నిర్వహించాలని ఆదేశిస్తామన్నారు. రాత్రి పెట్రోలింగ్ అమలుపై మరుసటి రోజు సమీక్ష నిర్వహిస్తామని చెప్పారు. డయల100, డయల్ 112కు వచ్చే ఫిర్యాదులపై పెట్రోలింగ్ వాహనాలు తక్షణమే స్పందించేలా చర్యలు తీసుకుంటామన్నారు.
హైదరాబాద్ ను సేఫ్ సిటీ గా తీర్చిదిద్దే క్రమంలో పౌరులు స్వేచ్ఛగా, సురక్షితంగా ఉన్నామని భరోసాను కల్పిస్తామన్నారు. సైబర్ నేరాల నియంత్రణ, మహిళల భద్రత, శాంతి భద్రతల పరిరక్షణకు మొదటి ప్రాధాన్యతను ఇస్తామన్నారు. వ్యవస్థీకృత నేరాలను అణిచివేసేందుకు బీఎనఎస్ లోని కొత్త నిబంధనలను ఉపయోగిస్తామని సీపీ మహేష్ భగవత్ పేర్కొన్నారు. డ్రగ్స్ కేసులలోని నిందితులపై పీడీ యాక్ట్ ను విధించి వారిని 8 నుంచి ఏడాది పాటు జైలులో ఉంచుతామని సీపీ హెచ్చరించారు.
ఈగల్ విభాగం ద్వారా ఈ కేసుల దర్యాప్తు నాణ్యతను పెంచి ఫాస్ట్ ట్రాక్ కోర్టులలో విచారణను చేపట్టి నిందితులకు శిక్షలు పడేలా చేస్తామని తెలిపారు. హైదరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ తో కలిసి కమ్యూనిటీ పోలీసింగ్ ను బలోపేతం చేస్తామన్నారు. డయల్ 112, 100 ఫోన్ కాల్స్ కు తక్షణమే పోలీసు సేవలు అందేలా చర్యలు తీసుకుంటామన్నారు. పోలీసు స్టేషన్లలో కేసులు వెంటనే నమోదయ్యేలా పని చేస్తామని సీపీ మహేష్ భగవత్ స్పష్టం చేశారు. కమిషనరేట్ పరిధిలోని ప్రతి ఒకరు ఒక టీంగా పని చేసి హైదరాబాద్ ను అత్యంత సురక్షితమైన నగరంగా తీర్చిదిద్దుతామని ఆయన చెప్పారు.
చట్టాన్ని గౌరవించే పౌరులతో ఫ్రెండ్లీ పోలీసింగ్ ఉంటుందని మహేశ్ భగవత్ స్పష్టం చేశారు. సిటీ పోలీస్ కమిషనర్లుగా పనిచేసిన సీవీ ఆనంద్, వీసీ సజ్జనార్ కార్యక్రమాలను కొనసాగిస్తామన్నారు. పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులపై వెంటనే కేసులు నమోదు చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. నగరంలో గతంలోనూ వివిధ హోదాల్లో పనిచేసిన అనుభవం తనకు ఉందని, అది ఉపయోగపడుతుందన్నారు. బాధ్యతలు స్వీకరించిన తర్వాత వివిధ జోన్ల డీసీపీలు, ట్రాఫిక్, టాస్క్‌ఫోర్స్, ఇతర విభాగాల అధికారులతో సమావేశమై నగరంలోని ప్రస్తుత పరిస్థితులు, సమస్యలపై సమీక్ష నిర్వహించారు.







