గ్రేటర్ డెలావేర్ వాలీ తెలుగు సంఘం ఆధ్వర్యంలో ‘‘దీపావళి వేడుకలు’’
గ్రేటర్ డెలావేర్ వాలీ తెలుగు సంఘం (TAGDV) వారు అత్యంత వైభవంగా ‘దీపావళి వేడుకలు’ (Deepavali Celebrations) నిర్వహించనున్నారు.53 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ సంఘం ఆధ్వర్యంలో జరగనున్న ఈ వేడుకలకు తెలుగు ప్రజలందరూ పెద్ద ఎత్తున హాజరు కావాలని నిర్వాహకులు పిలుపునిస్తున్నారు.
నవంబర్ 14 న, మధ్యాహ్నం 2:00 గంటల నుంచి ఈ కార్యక్రమం ప్రారంభం అవుతుంది Upper Merion Area Middle School450 కీబ్లర్ రోడ్, కింగ్ ఆఫ్ ప్రష్యా, PA 19406 వేదికగా ఈ వేడుకలు జరుగుతాయి. ఈ వేడుకలకు ప్రవేశం పూర్తిగా ఉచితం, అయితే ముందుగా RSVP చేసుకోవడం తప్పనిసరి అని నిర్వాహకులు పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి
ఈ వేడుకలో ప్రత్యేక కార్యక్రమాలివీ…
ప్రముఖ గాయకులు తరుణ్, సుమంగళిల ఆధ్వర్యంలో గీతాలు మరియు మధురమైన పాటలతో కూడిన సంగీత విభావరి ప్రేక్షకులను అలరించనుంది. ఈ కార్యక్రమానికి శ్వేత యాంకర్‌గా వ్యవహరించనున్నారు.
ఈ వేడుకలను విజయవంతం చేయడానికి హరీష్ అన్నాబత్తిన (అధ్యక్షులు), సురేష్ బొండుగుల (ఉపాధ్యక్షులు), శివ అనంటుని (కార్యదర్శి), మధు బుడతి (కోశాధికారి), లయ ఇనాంపుడి (జాయింట్ సెక్రటరీ) మరియు స్వాతి కొండేటి (జాయింట్ ట్రెజరర్)తో పాటు సభ్యులందరూ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఆసక్తి గల వారు పోస్టర్‌లోని క్యూఆర్ కోడ్ (QR Code)ను స్కాన్ చేసి తమ పేర్లను నమోదు చేసుకోవాల్సిందిగా కోరుతున్నారు.
కార్యక్రమ వివరాలు :
తేదీ : నవంబర్ 14
సమయం : మధ్యాహ్నం 2:00 గంటల నుంచి
వేదిక : Upper Merion Area Middle School450 కీబ్లర్ రోడ్, కింగ్ ఆఫ్ ప్రష్యా, PA 19406
ప్రత్యేక కార్యక్రమాలు :
సంగీత విభావరి






