కొత్త డైరెక్టర్ల వైపు మెగాస్టార్ చూపు!
మెగాస్టార్ చిరంజీవి(chiranjeevi) తన నెక్ట్స్ సినిమాల సెలెక్షన్ లో కొత్త ఆలోచనలకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు టాలీవుడ్ లోని రెగ్యులర్ కమర్షియల్ డైరెక్టర్లతో ఎక్కువగా వర్క్ చేసిన ఆయన, ఈసారి ఇతర భాషల టాలెంటెడ్ ఫిల్మ్ మేకర్స్‌తో కలిసి వర్క్ చేసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారనే ప్రచారం మొదలైంది. ముఖ్యంగా కోలీవుడ్ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్(Karthik Subbaraj), మలయాళ డైరెక్టర్ తరుణ్ మూర్తి(Tharun Murthy) చిరంజీవికి కథలు వినిపించినట్లు ఇండస్ట్రీ వర్గాల్లో డిస్కషన్ నడుస్తోంది. అయితే ఈ ప్రాజెక్టుల విషయంలో ఇంకా ఎలాంటి ఫైనల్ డెసిషన్ తీసుకోలేదని సమాచారం.
కార్తీక్ సుబ్బరాజ్ తన విభిన్నమైన కథాంశాలు, స్పెషల్ స్క్రీన్ ప్లేతో సౌత్ ఆడియన్స్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. మరోవైపు మోహన్‌లాల్(Mohanlal)తో తెరకెక్కించిన తుడరుమ్(Thudarum)తో సత్తా చాటిన తరుణ్ మూర్తి, స్టార్ హీరోలను కొత్త యాంగిల్ లో చూపించగల డైరెక్టర్ గా పేరు సంపాదించారు. ఈ ఇద్దరిలో ఎవరో ఒకరితో చిరంజీవి సినిమా చేస్తే ఫ్యాన్స్ కు భిన్నమైన అనుభూతి దక్కుతుందనే అంచనాలు ఉన్నాయి. ఇక శ్రీకాంత్ ఓదెల(Srikanth Odela)తో గతంలో ప్రచారంలోకి వచ్చిన సినిమా విషయంలో మాత్రం ప్రస్తుతానికి క్లారిటీ లేదు.
ఇవి కూడా చదవండి
ప్రస్తుతం చిరంజీవి చేతిలో విశ్వంభర(Viswambhara), కాకా(Kaka) వంటి ప్రాజెక్టులతో పాటు నెట్‌ఫ్లిక్స్ కోసం మెగావర్స్ టాక్ షో(Megaverse talk show) కూడా ఉంది. ఈ పనులు పూర్తయ్యేలోపు కొత్త సినిమాల కథలను ఫిక్స్ చేసుకోవాలని ఆయన భావిస్తున్నారట. నెక్ట్స్ ఇయర్ సమ్మర్ తర్వాత కొత్త సినిమాను ప్రారంభించి, 2028 సంక్రాంతికి రిలీజ్ చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. అయితే ఈ వార్తలపై అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చే వరకు వేచి చూడాల్సిందే.







