ఆస్ట్రేలియాలో రజనీకాంత్ ‘జైలర్ 2’ చరిత్ర: 2 మిలియన్ డాలర్ల మార్క్ దాటిన తొలి తమిళ చిత్రం!
సూపర్‌స్టార్ రజనీకాంత్ నటించిన ‘జైలర్ 2’ ఓవర్సీస్ బాక్సాఫీస్ వద్ద మరో రికార్డు సృష్టించింది. ఆస్ట్రేలియాలో 11 రోజుల్లోనే 2 మిలియన్ ఆస్ట్రేలియన్ డాలర్ల వసూళ్ల మార్కును దాటిన తొలి తమిళ చిత్రంగా నిలిచింది. తాజా ట్రేడ్ నివేదికల ప్రకారం, ఈ సినిమా అక్కడ మొత్తం A$2,030,445 గ్రాస్ వసూలు చేసింది.
‘పొన్నియిన్ సెల్వన్ 1’ రికార్డు బద్దలు
ఇప్పటివరకు ఆస్ట్రేలియాలో అత్యధిక వసూళ్లు సాధించిన తమిళ చిత్రంగా మణిరత్నం తెరకెక్కించిన ‘పొన్నియిన్ సెల్వన్: పార్ట్ 1’ నిలిచింది. ఆ సినిమా A$1.78 మిలియన్ల గ్రాస్ వసూళ్లు సాధించింది. ఇప్పుడు ‘జైలర్ 2’ కేవలం 11 రోజుల్లోనే ఆ రికార్డును అధిగమించింది.
ఇవి కూడా చదవండి
ఆస్ట్రేలియాలో అత్యధిక వసూళ్లు సాధించిన టాప్ 10 తమిళ సినిమాలు
ర్యాంక్ సినిమా ఆస్ట్రేలియా గ్రాస్
1 జైలర్ 2 A$2.03 మిలియన్లు
2 పొన్నియిన్ సెల్వన్ 1 A$1.78 మిలియన్లు
3 జైలర్ A$1.59 మిలియన్లు
4 లియో A$1.45 మిలియన్లు
5 కూలీ A$1.44 మిలియన్లు
6 2.0 A$1.38 మిలియన్లు
7 పొన్నియిన్ సెల్వన్ 2 A$1.28 మిలియన్లు
8 ది గోట్ A$1.15 మిలియన్లు
9 విక్రమ్ A$1.09 మిలియన్లు
10 మాస్టర్ A$820,000
ఆస్ట్రేలియాలో తమిళ సినిమా రికార్డులకు రజనీకాంత్ కొత్త దారులు
ఆస్ట్రేలియాలో గతంలోనూ తమిళ సినిమా వసూళ్లలో రజనీకాంత్ చిత్రాలు అనేక కీలక మైలురాళ్లను అందుకున్నాయి. ట్రేడ్ రిపోర్ట్ ప్రకారం..
– A$250,000: శివాజీ
– A$500,000: కబాలి
– A$1 మిలియన్: 2.0
– A$1.5 మిలియన్లు: పొన్నియిన్ సెల్వన్ 1
– A$2 మిలియన్లు: జైలర్ 2
ఈ ఐదు మైలురాళ్లలో నాలుగింటిని తొలుత రజనీకాంత్ సినిమాలే అందుకున్నాయి. A$1.5 మిలియన్ల రికార్డును ‘పొన్నియిన్ సెల్వన్ 1’ సాధించగా, ఇప్పుడు ‘జైలర్ 2’ ఆస్ట్రేలియాలో అగ్రస్థానాన్ని దక్కించుకుంది.
టాప్ 6లో మూడు రజనీకాంత్ సినిమాలు
ఆస్ట్రేలియాలో అత్యధిక వసూళ్లు సాధించిన టాప్ 6 తమిళ చిత్రాల్లో రజనీకాంత్ నటించిన ‘జైలర్ 2’, ‘జైలర్’, ‘2.0’ చోటు దక్కించుకున్నాయి. టాప్ 10లో ఐదో స్థానంలో ఉన్న ‘కూలీ’ కూడా రజనీకాంత్ చిత్రమే కావడంతో, ఈ జాబితాలో ఆయన సినిమాల ఆధిపత్యం స్పష్టంగా కనిపిస్తోంది.
ప్రపంచవ్యాప్తంగా ‘జైలర్ 2’ జోరు!
ఆస్ట్రేలియాలో సాధించిన రికార్డు ఈ సినిమా ఓవర్సీస్ విజయానికి మరో ఉదాహరణగా నిలుస్తోంది. ‘జైలర్ 2’ విదేశీ మార్కెట్లలో రూ.250 కోట్ల వసూళ్లను దాటడంతో పాటు, భారత్ వెలుపల 25 మిలియన్ అమెరికన్ డాలర్ల వసూళ్లు సాధించిన తొలి తమిళ చిత్రంగా నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా 11 రోజుల్లో సుమారు రూ.710 కోట్ల గ్రాస్ వసూలు చేసింది.
—సూర్య ప్రకాష్ జోశ్యుల








