పండగ కల్చర్ కు ఖుషీ మోడ్రన్ టచ్
బాలీవుడ్ యంగ్ బ్యూటీ ఖుషీ కపూర్ తనదైన ఫ్యాషన్ సెన్స్ తో ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తోంది. ఇటీవల ముంబైలో నిర్వహించిన ఎక్స్‌క్లూజివ్ దీపావళి సెలబ్రేషన్స్ ఈవెంట్లో ఖుషీ కపూర్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. ఈ ఫ్యాషన్ వేడుకలో ఖుషీ కపూర్ ధరించిన అవుట్‌ఫిట్ నెటిజన్లను అలరిస్తోంది. ఫ్రంట్ లో సాటిన్ బో – షీర్ ప్యానెల్‌తో ఉన్న బ్లాక్ క్రాప్డ్ జాకెట్‌ను ధరించగా, ఈ జాకెట్‌కు ఉన్న సాఫ్ట్ ఫెదర్ కఫ్స్ ఆమె లుక్కు మరింత రాయల్ టచ్ ను ఇచ్చాయి. దీనికి కాంబినేషన్‌గా క్రీమ్ కలర్ కాలమ్ స్కర్ట్, బ్లాక్ ఎంబెల్లిష్డ్ వాలెంటినో బ్యాగ్ – పెర్ల్ డ్రాప్ ఈకరింగ్స్తో ఆమె ఎంతో గ్రేస్‌ఫుల్‌గా కనిపించారు. పండుగ వాతావరణానికి మోడ్రన్ ఫ్యాషన్ టచ్ ఇస్తూ ఆమె ఎంచుకున్న ఈ లుక్, బాలీవుడ్ కొత్త ఫ్యాషన్ ఐకాన్‌గా ఆమెకున్న గుర్తింపును మరోసారి నిరూపించింది.








