ప్రముఖ నటి ఇంద్రజ చేతుల మీదుగా ‘జుఒన్’ సూపర్ యాప్ లాంచ్!
▪️ఇంటింటికి ఉపయోగపడే సూపర్ యాప్.. JUONE’
▪️ ఒకే యాప్‌లో ఫుడ్, గ్రాసరీ, ట్రావెల్, హెల్త్, హోమ్.. వంటి 25 సర్వీసులు
▪️ వేడుకలో పాల్గొన్న ఇంద్రజ, జబర్దస్త్ ఆర్టిస్టులు..
▪️ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు.. 4 రాష్ట్రాల్లో సేవలు ప్రారంభం
▪️ ఫుడ్ డెలివరీ నుంచి క్యాబ్ బుకింగ్ వరకు..
▪️ వైద్య సేవల నుంచి ఇంటి పనుల వరకు అన్నీ ఒకేచోట!
హైదరాబాద్: రోజువారీ జీవితంలో ఎదురయ్యే అనేక అవసరాలకు వేర్వేరు యాప్‌లను ఉపయోగించే రోజులకు స్వస్తి పలుకుతూ.. అన్ని రకాల సేవలను ఒకే వేదికపై అందించాలనే లక్ష్యంతో రూపొందించిన ‘జుఒన్’ (JUONE) సూపర్ యాప్ ఘనంగా ప్రారంభమైంది. హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలోని పీర్లెస్ హోటల్లో ఈ గ్రాండ్ లాంచ్ కార్యక్రమం వైభవంగా జరిగింది. ప్రముఖ సినీ నటి ఇంద్రజ, ఏఎన్ఎన్ మీడియా గ్రూప్ వ్యవస్థాపకులు కంది రామచంద్రారెడ్డి, జబర్దస్త్ రాము, యాప్ బ్రాండ్ అంబాసిడర్ రాధిక ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌తో పాటు తమిళనాడు, కర్నాటక రాష్ట్రాల్లో కూడా ఈ యాప్ లాంచ్ అయింది. నగరాల్లో మాత్రమే కాకుండా, సెమీ-అర్బన్, పట్టణ ప్రాంతాల్లో ‘జుఒన్’ సూపర్ యాప్ సేవలు అందుబాటులో వచ్చాయి.
ఒకే యాప్.. ఎన్నో సేవలు!
‘కనెక్ట్, సర్వీసెస్, గ్రో’.. ‘వన్ యాప్, మెనీ సొల్యూషన్స్’ అనే నినాదాలతో ముందుకొచ్చిన జుఒన్.. వినియోగదారుల రోజువారీ అవసరాలను సులభతరం చేసే లక్ష్యంతో విభిన్న సేవలను ఒకే డిజిటల్ వేదికపైకి తీసుకొచ్చింది. ఆహారం ఆర్డర్ చేయడం నుంచి నిత్యావసర సరుకులు తెప్పించుకోవడం వరకు, ప్రయాణాల కోసం క్యాబ్‌లు బుక్ చేసుకోవడం నుంచి హోటళ్లు, రిసార్టులు రిజర్వ్ చేసుకోవడం వరకు అనేక సౌకర్యాలను ఒకే యాప్ ద్వారా పొందేలా దీన్ని రూపొందించారు.

ఈ వేడుకలో ముఖ్య అథితిగా పాల్గొన్న ప్రముఖ సినీ నటి ఇంద్రజ మాట్లాడుతూ.. ప్రస్తుత డిజిటల్ యుగంలో ప్రజల రోజువారీ అవసరాలకు అనుగుణంగా అన్ని రకాల సేవలను ఒకే వేదికపై అందించడం అభినందనీయమని నిర్వహకులను అభినందించారు. జుఒన్ సూపర్ యాప్ ప్రజలకు ఎంతో సౌకర్యవంతంగా ఉపయోగపడుతుందని, ఈ వినూత్న ప్రయత్నం విజయవంతం కావాలని ఆకాంక్షించారు.
ఏఎన్ఎన్ మీడియా గ్రూప్ వ్యవస్థాపకులు కంది రామచంద్రారెడ్డి మాట్లాడుతూ.. సాంకేతికతను ప్రజల అవసరాలకు అనుసంధానిస్తూ రూపొందించిన జుఒన్ సూపర్ యాప్ ఆధునిక జీవనశైలికి అనుగుణంగా ఉందని అన్నారు. వివిధ సేవలను ఒకే వేదికపైకి తీసుకురావడం ద్వారా వినియోగదారుల సమయాన్ని ఆదా చేయడంతో పాటు డిజిటల్ సేవలకు మరింత చేరువ చేసే అవకాశం ఉందని పేర్కొన్నారు.
జుఒన్ బ్రాండ్ అంబాసిడర్ రాధిక మాట్లాడుతూ.. ఫుడ్ డెలివరీ, షాపింగ్, ప్రయాణం, ఆరోగ్యం, గృహ సేవలు వంటి అనేక అవసరాలకు ఒకే యాప్ అందుబాటులోకి రావడం సంతోషకరమని అన్నారు. 25 రకాల సర్వీసులు ప్రతి ఒక్కరికీ ఉపయోగపడేలా రూపొందించిన జుఒన్ సూపర్ యాప్‌ను ప్రజలు ఆదరించాలని, ఈ యాప్ మరింత అభివృద్ధి చెంది విస్తృత ఆదరణ పొందాలని ఆకాంక్షించారు.

ఇంట్లో ఏ అవసరమొచ్చినా.. జుఒన్!
ఫుడ్ డెలివరీ, గ్రాసరీ, ఫార్మసీ సేవలతో పాటు క్యాబ్ బుకింగ్, కార్లు–బైక్‌ల అద్దె, లాజిస్టిక్స్, ప్యాకర్స్ అండ్ మూవర్స్ సేవలు ఈ యాప్‌లో అందుబాటులో ఉన్నాయి. హోటళ్లు, రిసార్టులు, ఈవెంట్లు, పర్యాటక సేవలు, హాస్టళ్లు, పీజీ వసతి బుకింగ్ సౌకర్యాలు కూడా ఉన్నాయి. షాపింగ్, బ్యూటీ పార్లర్, ఇంటి శుభ్రత, పెస్ట్ కంట్రోల్, ప్లంబింగ్, ఎలక్ట్రికల్, ఏసీ సర్వీసులతో పాటు కంప్యూటర్, మొబైల్, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాల మరమ్మతు సేవలను పొందవచ్చు.
ఆరోగ్యానికి సంబంధించిన అవసరాల కోసం డాక్టర్ కన్సల్టేషన్, ల్యాబ్ టెస్టులు, నర్సింగ్ సేవలను కూడా అందించేలా యాప్‌ను రూపొందించారు. ఇలా వ్యక్తిగత అవసరాల నుంచి కుటుంబ అవసరాల వరకు 25 రకాల సేవలను ఒకే చోట అందించడం జుఒన్ ప్రత్యేకతగా నిలవనుంది.
సాంకేతికతతో మరింత సౌకర్యవంతమైన జీవనం
ప్రస్తుత డిజిటల్ యుగంలో సమయం ఎంతో విలువైనది. అనేక యాప్‌లను డౌన్లోడ్ చేసుకోవడం, వేర్వేరు వేదికల్లో సేవల కోసం వెతకడం, బుకింగ్‌లు చేసుకోవడం వంటి ఇబ్బందులను తగ్గించే దిశగా జుఒన్ అడుగులు వేస్తోంది. సులభమైన యాక్సెస్, నమ్మకమైన సేవలు, వేగవంతమైన సదుపాయాలతో వినియోగదారులకు మెరుగైన అనుభవాన్ని అందించడమే తమ లక్ష్యమని నిర్వాహకులు తెలిపారు.
ఫౌండర్ అండ్ సీఈఓ పి. సురేంద్రబాబు మాట్లాడుతూ.. “ప్రజల రోజువారీ అవసరాలకు సంబంధించిన సేవలన్నింటినీ ఒకే వేదికపైకి తీసుకురావాలనే ఆలోచనతో జుఒన్ సూపర్ యాప్‌ను రూపొందించాం. ఫుడ్, గ్రాసరీ, ట్రావెల్, హెల్త్ నుంచి ఇంటి నిర్వహణకు అవసరమైన సేవల వరకు అనేక సదుపాయాలను ఒకే యాప్‌లో అందించాలన్నది మా లక్ష్యం. వినియోగదారుల సమయాన్ని ఆదా చేస్తూ, వారి అవసరాలకు అనుగుణంగా సులభమైన డిజిటల్ సేవలను అందించేందుకు కృషి చేస్తున్నాం. ‘వన్ యాప్.. మెనీ సొల్యూషన్స్’ అనే మా ఆలోచనను ప్రజలకు సంతృప్తికరంగా చేరువ చేయడమే మా ప్రయత్నం, వివరాలకు www.juone.in ను సందర్శించవచ్చు” అని తెలిపారు.
ఇవి కూడా చదవండి
ప్రొప్రైటర్ బి. వివేక్ మాట్లాడుతూ.. “ప్రతి ఒక్కరికీ ఉపయోగపడేలా, రోజువారీ జీవితంలో అవసరమయ్యే సేవలను ఒకే చోట అందుబాటులోకి తీసుకురావడమే జుఒన్ ప్రత్యేకత. ప్రయాణం, షాపింగ్, ఆహారం, వైద్యం, ఇంటి అవసరాలు.. ఇలా వివిధ సేవల కోసం వేర్వేరు వేదికలను ఆశ్రయించాల్సిన అవసరాన్ని తగ్గించాలనుకుంటున్నాం. సౌకర్యం, వేగం, వినియోగదారులకు సులభమైన అనుభవం మా ప్రధాన ప్రాధాన్యతలు. సెమీ-అర్బన్, పట్టణ ప్రాంతాల్లో ‘జుఒన్’ సూపర్ యాప్ సేవలు అందుబాటులో వచ్చాయి” అని పేర్కొన్నారు.
ప్రముఖుల అభినందనలు
జుఒన్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న అతిథులు ఈ నూతన ప్రయత్నాన్ని అభినందించారు. డిజిటల్ సాంకేతికతను ప్రజల రోజువారీ అవసరాలకు అనుసంధానించడం ద్వారా మరింత సౌకర్యవంతమైన సేవలు అందించే అవకాశం ఉందని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు, ఆహ్వానితులు పాల్గొని నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపారు.
స్మార్ట్ భవిష్యత్తు వైపు మరో అడుగు
‘టుగెదర్ ఫర్ ఏ స్మార్టర్ టుమారో’ అనే సందేశంతో ముందుకొచ్చిన జుఒన్.. ఒకే యాప్ ద్వారా అనేక సేవలను అందించే సూపర్ యాప్ విభాగంలో తనదైన గుర్తింపు సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది.
ఆహారం, ప్రయాణం, ఆరోగ్యం, ఇంటి అవసరాలు.. ఇలా జీవితంలోని విభిన్న అవసరాలకు ఒకే డిజిటల్ చిరునామాగా నిలవాలనుకుంటున్న జుఒన్ సూపర్ యాప్, వినియోగదారులకు మరింత సులభమైన, సౌకర్యవంతమైన సేవల అనుభవాన్ని అందించే దిశగా అడుగులు వేస్తోంది.








