దేశ ప్రజలకు ఖర్గే బేషరతుగా క్షమాపణలు చెప్పాలి : బండి సంజయ్
ప్రధాని మోదీ (Prime Minister Modi)పై ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే (Mallikarjun Kharge) చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్టు కేంద్ర మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) తెలిపారు. కాంగ్రెస్ పార్టీ దిగజారుడుతనానికి ఖర్గే వ్యాఖ్యలే నిదర్శనమని మండిపడ్డారు. మోదీ వ్యక్తిగత జీవితం, కుటుంబాన్ని విమర్శలకు వాడుకోవడం దుర్మార్గం. ఆయన చిన్నతనంలో ఎదుర్కొన్న పేదరికాన్ని ఎగతాళి చేయడం దారుణం. మోదీ తల్లిదండ్రులను లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేసి రాజకీయాల్లోకి లాగడం నీచం. ప్రజలకు చెప్పుకోవడానికి ఏమీ లేక కాంగ్రెస్ పార్టీ (Congress Party) అవమానకరమైన వ్యాఖ్యలు చేస్తోంది. మోదీ కుటుంబంపై దాడులను దేశ ప్రజలు ఎన్నటికీ అంగీకరించరు. దేశ ప్రజలకు ఖర్గే బేషరతుగా క్షమాపణలు చెప్పాలి అని డిమాండ్ చేశారు.








