రక్షణ రంగంలో అగ్రగామిగా భారత్.. సీఎం రేవంత్ రెడ్డి ఆకాంక్ష
‘రక్ష ఎక్స్పో 2026’ (ఋఅక్ష ఏక్ష్పొ-2026) కర్టెన్ రైజర్ ను ఆవిష్కరించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు.
ఋఅక్ష ఏక్ష్పొ-2026 ఛుర్తైన్ ఋఐసెర్ కార్యక్రమంలో ముఖ్యమంత్రి స్క్రోలింగ్ పాయింట్స్….
“రక్షా ఎక్స్పో – కర్టెన్ రైజర్” కార్యక్రమంలో పాల్గొనడం సంతోషంగా ఉంది.
డిసెంబర్ 7, 8, 9 తేదీల్లో హైదరాబాద్ భారత్ ఫ్యూచర్ సిటీలో జరగనున్న ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌లో పాల్గొనాల్సిందిగా మీ అందరినీ ఆహ్వానిస్తున్నాం.
గతేడాది మొదటిసారి నిర్వహించిన గ్లోబల్ సమ్మిట్ విజయవంతమైంది.
రెండోసారి నిర్వహించే సదస్సు మరింత భారీస్థాయిలో జరగబోతోంది.
రక్షణ రంగానికి చెందిన భాగస్వాములందరితో ఒకే వేదికపై చర్చించే అంతర్జాతీయ వేదికగా రక్షా ఎక్స్పోను తీర్చిదిద్దాలన్నది నా ఆలోచన.
ఇదొక ప్రతిష్ఠాత్మకమైన కార్యక్రమం.
ఈ సమావేశంలో రక్షణ, స్పేస్, ఏరోస్పేస్, భద్రతా రంగాలకు చెందిన ప్రముఖులు ఎంతో మంది ఉన్నారు.
మన పారిశ్రామిక రంగానికి చెందిన దిగ్గజ సంస్థలు కూడా ఇక్కడున్నాయి.
డీఆర్డీఓ (డృడో), హెచ్ఏఎల్ (హాళ్), బీడీఎల్ (భ్డ్ళ్), మిధాని, టాటా సంస్థలు, ఎయిర్‌బస్, సాఫ్రాన్, స్కైరూట్, లాక్‌హీడ్ మార్టిన్, భారత్ ఫోర్జ్ వంటి ఎన్నో ప్రముఖ సంస్థల ప్రతినిధులు మన మధ్య ఉన్నారు.
భారతదేశంలో హైదరాబాద్ ఒక వ్యూహాత్మకమైన ప్రదేశంగా కీలకమైన స్థానంలో ఉంది.
హైదరాబాద్ అత్యంత సురక్షితమైన నగరం… అనేక ముఖ్యమైన పరిశోధనా సంస్థలకు నిలయం.
భారత సైన్యం, భారత వైమానిక దళాలకు సంబంధించిన అనేక ముఖ్యమైన స్ట్రాటజిక్ కేంద్రాలు ఇక్కడున్నాయి.
దక్షిణ భారతదేశంలో సముద్రతీరం లేని ఏకైక రాష్ట్రం తెలంగాణ.
అయినప్పటికీ, భారత నౌకాదళానికి రాష్ట్రం కీలకమైన సేవలు అందిస్తోంది.
తెలంగాణలోని వికారాబాద్ జిల్లా దామగుండం రిజర్వ్ ఫారెస్ట్‌లో అత్యంత తక్కువ పౌనఃపున్యాల (వెర్య్ ళౌ Fరెqఉఎంచ్య్ – వ్ళ్F) నౌకాదళ రాడార్ కేంద్రాన్ని నిర్మిస్తున్నారు.
ఈ రంగానికి ప్రతిభావంతులైన యువత అవసరం.
అందుకు మనకు ఐఐటీ, ఐఐఐటీ, ఎన్ఐటీ, ఐఎస్బీ, బిట్స్ వంటి అత్యుత్తమ విద్యాసంస్థలున్నాయి.
నైపుణ్యాలు కలిగిన మానవ వనరులను సిద్ధం చేసేందుకు యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని నిర్మిస్తున్నాం.
ఐటీఐలను అడ్వాన్స్డ్ ట్రైనింగ్ సెంటర్లుగా (ఆట్ఛ్స్) తీర్చిదిద్దాం.
విజయవంతంగా పనిచేస్తున్న ఇంక్యుబేటర్లు కూడా ఇక్కడ ఉన్నాయి.
రక్షణ రంగంలో ప్రపంచ స్థాయిలో అగ్రగామిగా భారతదేశాన్ని చూడాలన్నది నా ఆకాంక్ష.
యుద్ధానికి అవసరమైన సాంకేతికతను దిగుమతి చేసుకునే స్థాయి నుంచి రక్షణ సాంకేతిక ఎగుమతులు చేసే దేశంగా భారత్ ఎదగాలి.
యుద్ధం కోసమే కాకుండా, శాంతిని కాపాడేందుకు కూడా ఆయుధాలు అవసరం.
శత్రువులు యుద్ధానికి దిగకుండా నిరోధించే శక్తి కూడా మనకు ఒక వ్యూహాత్మక ఆధిక్యాన్ని అందిస్తుంది.
ఈ దార్శనికతను సాకారం చేసేందుకు తెలంగాణ రాష్ట్రం ఇప్పటికే పెద్ద ఎత్తున కృషి చేస్తోంది.
అయితే, అందుకు మీరంతా మరింతగా సహకారాన్ని అందించి మరిన్ని విజయాలను సాధించాల్సిన అవసరం ఉంది.
భారతదేశ రక్షణ పరిశ్రమకు తెలంగాణ అతిపెద్ద పారిశ్రామిక కేంద్రంగా ఎదగాలి.
రక్షణ రంగంతో పాటు స్పేస్, ఏరోస్పేస్, సైబర్ సెక్యూరిటీ, కృత్రిమ మేధస్సు, డ్రోన్ టెక్నాలజీ వంటి అనేక అనుబంధ రంగాల్లో ఈ సమావేశానికి హాజరైన మీరందరూ సహకరించి లక్ష్యాన్ని సాకారం చేయాలని ఆశిస్తున్నా.
తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని మీరు వేసుకున్న ప్రణాళికలను రెట్టింపు చేయండి.
లక్ష్యాన్ని సాధించడానికి నా నుంచి మీకు ఎలాంటి సహకారం కావాలో చెప్పండి.
సహకరించడానికి నేను సిద్ధంగా ఉన్నా… అది నా హామీ.
తెలంగాణ రాష్ట్రం కోసం నాకొక స్పష్టమైన దార్శనికత ఉంది.
ఈ లక్ష్యాన్ని సాధించడంలో తెలంగాణ గణనీయమైన పాత్ర పోషిస్తోంది.
అయితే, ఇంకా ఎన్నో విజయాలు సాధించాల్సిన అవసరం ఉంది.
భారతదేశ రక్షణ రంగ పరిశ్రమకు అతిపెద్ద పారిశ్రామిక కేంద్రంగా తెలంగాణ ఎదగాలి.
అందుకు మీ అందరి సహకారం కావాలి.
తెలంగాణ 2034 నాటికి 1 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక శక్తిగా, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో గతేడాది తెలంగాణ రైజింగ్ విజన్ 2047 డాక్యుమెంట్ ను విడుదల చేశాం.
దేశ జనాబాలో ప్రస్తుతం తెలంగాణ వాటా 2.5 శాతానికి పైగా ఉంది.
దేశ స్థూల జాతీయోత్పత్తి (ఘ్డ్ఫ్)లో తెలంగాణ 5 శాతం వాటాను అందిస్తోంది.
2047 నాటికి ఆ వాటాను 10 శాతం సాధించాలన్నది నా లక్ష్యం.
ఈ దార్శనికతను సాకారం చేయడంలో రక్షణ ఉత్పత్తుల తయారీ, ఏరోస్పేస్, వాటి అనుబంధ రంగాలు కీలక పాత్ర పోషిస్తాయి.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఒరిజినల్ ఎక్విప్మెంట్ మాన్యుఫ్యాక్చరర్స్ (ఓఏంస్), సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు (శంఏస్) ఒకే వేదికపై కలుసుకునేందుకు “ఋఅక్ష ఏక్ష్పొ” ఒక ప్రధాన వేదికగా మారుతుంది.
పరిశ్రమల ప్రతినిధులు ఉన్నత స్థాయి రక్షణ దళాల అధికారులు, భద్రతా రంగ అధికారులు, నిపుణులు, స్టార్టప్‌లు వినూత్న ఆలోచనలను, సరికొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని తీసుకురావాలని ఆశిస్తున్నా.

రాష్ట్రంలో పాలసీ పెరాలసిస్ లేదు…
రాజకీయంగా, ఐడియాలజీ పరంగా భేదాభిప్రాయాలు ఉన్నా.. పెట్టుబడులు, అభివృద్ధి విషయంలో మాకు ఎలాంటి భేదాభిప్రాయాలు లేవు
కీలకమైన రంగాల్లో ఉన్న వారంతా పెద్ద పెద్ద లక్ష్యాలతో ఆలోచనలు చేయాలి.
మన దగ్గర తెలివైన, నైపుణ్యం కలిగిన మానవ వనరులు, అవసరమైన వనరులున్నాయి.
ముఖ్యంగా, అభివృద్ధి పట్ల స్పష్టమైన విధానం, దృఢ సంకల్పం, ముందుకు సాగాలనే తపన మనకుంది.
త్వరలోనే “ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ పాలసీ 2.0”ను విడుదల చేయబోతున్నాం.
ఈ విధానం తెలంగాణ రైజింగ్ 2047 లక్ష్యాలకు అనుగుణంగా ఉంటుంది.
డిసెంబర్లో జరగబోయే ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ లో మిమ్మల్ని మళ్లీ కలుసుకుంటా.
రక్షణ రంగంలో భారతదేశాన్ని ప్రపంచంలోనే ఒక అగ్రగామిగా శక్తివంతమైన దేశంగా తీర్చిదిద్దేందుకు మనమందరం కలిసి పనిచేద్దాం.
హాజరైన ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, డీజీపీ సీవీ ఆనంద్, రక్షణ రంగ నిపుణులు, భారత సాయుధ దళాల అధికారులు, కేంద్ర ప్రభుత్వ అధికారులు, వివిధ సంస్థల ప్రతినిధులు.








