తెలంగాణకే కాదు .. దేశవ్యాప్తంగా ప్రస్తుతం ఇదే పరిస్థితి : మంత్రి అడ్లూరి
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఎల్‌నినో (Elnino) ప్రభావం ఉందని తెలంగాణ రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ (Adluri Lakshman) అన్నారు. సీఎల్పీ కార్యాలయంలో అడ్లూరి లక్ష్మణ్ మీడియాతో మాట్లాడుతూ ఇది తెలంగాణ (Telangana)కే పరిమితమైన అంశం కాదని వివరించారు. ఎల్‌నినో ప్రభావంపై విపక్షాలు అనవసర ఆరోపణలు చేస్తున్నాయని మండిపడ్డారు. దేశవ్యాప్తంగా ప్రస్తుతం ఇదే పరిస్థితి ఉంది. వచ్చే ఏడాది జులై వరకూ అప్రమత్తంగా ఉండాలి. ఎల్ నినోను ఎదుర్కొనేందుకు ప్రత్యేకంగా సబ్ కమిటీ (Sub-committee)ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. నీటిని ప్రణాళికాబద్దంగా వాడుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి వివరించారు. సీఎం వ్యాఖ్యలపై హరీశ్‌రావు దుష్ప్రచారం చేస్తున్నారు. ఎల్ నినో ప్రభావం దృష్ట్యా ప్రభుత్వం ప్రజలను అప్రమత్తం చేస్తోంది అని తెలిపారు.








