తెలుగు అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ బోస్టన్ ఆధ్వర్యంలో ’’సూపర్ సింగర్ 2026’’ పోటీలు
తెలుగు అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ బోస్టన్ ఆధ్వర్యంలో సూపర్ సింగర్ 2026 కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. దీనికి ‘‘TAGB SUPER SINGER 2026’’ పేరుతో ఈ సంగీత పోటీలను నిర్వహిస్తున్నారు. ప్రవాస ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వాసుల్లోని ప్రతిభావంతులైన గాయకులను వెలికితీసేందుకు ఈ వేదిక వేదిక కానుంది.
ఈ పోటీలు నవంబర్ 7, 2026 న మధ్యాహ్నం 12:30 నుండి సాయంత్రం 4:30 గంటల వరకు మసాచుసెట్స్‌లోని లెక్సింగ్టన్ కమ్యూనిటీ సెంటర్ (Lexington Community Center, MA) వేదికగా అత్యంత వైభవంగా జరగనున్నాయి.
సోలో సింగింగ్ విభాగంలో క్లాసికల్ (శాస్త్రీయ సంగీతం), సెమీ-క్లాసికల్ మరియు సినిమా పాటల (ఫిల్మ్) పోటీలు ఉంటాయి.
గీతం/స్వరజతి, వర్ణం లేదా మనోధర్మంతో కూడిన కృతి (స్వర కల్పన, రాగాలాపన, నెరవల్) విభాగాలు ఉన్నాయి. క్లాసికల్ విభాగంలో ఏ వయసు వారైనా పాల్గొనే అవకాశం కల్పించారు.
ఇవి కూడా చదవండి
వయసుల వారీ విభాగం (సెమీ-క్లాసికల్ & ఫిల్మ్):
సబ్ జూనియర్: 5-8 సంవత్సరాలు
జూనియర్: 9-12 సంవత్సరాలు
సీనియర్: 13-17 సంవత్సరాలు
పెద్దలు (అడల్ట్స్): 18 సంవత్సరాలు మరియు అంతకంటే ఎక్కువ వయసు గలవారు.
నిబంధనలు : క్లాసికల్ పాటలు తెలుగు లేదా సంస్కృతంలో ఉండవచ్చు (తెలుగు రచనలకు విశేష ప్రాధాన్యత ఉంటుంది). మిగిలిన అన్ని విభాగాలకు కేవలం తెలుగు పాటలు మాత్రమే పాడాలి.
నిడివి : సినిమా మరియు సెమీ-క్లాసికల్ పాటలకు 5 నిమిషాలు, గీతం/స్వరజతికి 6 నిమిషాలు, వర్ణానికి 8 నిమిషాలు, అలాగే క్లాసికల్ కృతి విభాగానికి 10 నిమిషాల సమయం కేటాయించారు.
రిజిస్ట్రేషన్ వివరాలు:
ఈ పోటీల కోసం రిజిస్ట్రేషన్ ప్రక్రియ అక్టోబర్ 2, 2026 నుండి ప్రారంభం కాగా, నవంబర్ 5, 2026 తో ముగియనుంది. ఆసక్తి గల అభ్యర్థులు నిర్ణీత గడువులోగా పేర్లను నమోదు చేసుకోవాలి. ఈ పోటీలకు సంబంధించి ఎలాంటి సందేహాలు ఉన్నా [email protected] ఈమెయిల్ ద్వారా నిర్వాహకులను సంప్రదించవచ్చు.








