భారత్ తో డీల్ కు దగ్గరగా ఉన్నాం.. ట్రంప్ కీలక వ్యాఖ్యలు..!
భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందం తుదిదశకు చేరుకుంటోంది. ఇరుదేశాలు ఈ ఒప్పందం విషయంలో చాలా దగ్గరలో ఉన్నాయని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలక ప్రకటన చేశారు. అంతే కాదు.. ఇది , గత ఒప్పందాల కంటే భిన్నంగా ఉంటుందన్నారు. అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో భారత్‌లో పర్యటిస్తూ.. ఇరు దేశాల మధ్య వాణిజ్యం, ఇంధనం, సాంకేతికత, రక్షణ, పరస్పర సంబంధాలపై చర్చిస్తున్న తరుణంలో ట్రంప్ నుంచి ఈ ప్రకటన వెలువడింది.
భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందంపై ఇరు దేశాల మధ్య గత కొన్ని నెలలుగా చర్చలు జరుగుతున్నాయి. తాజాగా వాణిజ్య ఒప్పందంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒక కీలక ప్రకటన చేశారు. భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందానికి చాలా దగ్గరగా ఉన్నాయని పేర్కొన్నారు. అయితే ఈ వాణిజ్య ఒప్పందం గత ఒప్పందాల కంటే గణనీయంగా భిన్నంగా ఉంటుందని కూడా స్పష్టం చేశారు. మంగళవారం ట్రంప్ అమెరికా- భారత్ వాణిజ్య ఒప్పందం గురించి మీడియాతో మాట్లాడారు. ఇరు దేశాలు ఒప్పందానికి చాలా దగ్గరగా ఉన్నాయని స్పష్టంగా పేర్కొన్నారు. ‘‘వారు ఒక ఒప్పందానికి రావాలని కోరుకుంటున్నారు. మేము కూడా ఒక ఒప్పందానికి రాబోతున్నాము. మేము చాలా దగ్గరగా ఉన్నాము.’’ అని అన్నారు. అయితే ఈ ఒప్పందం గత ఒప్పందాల కంటే చాలా భిన్నంగా ఉంటుందని స్పష్టం చేశారు.
అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో భారత పర్యటన సందర్భంగా ట్రంప్ ఈ ప్రకటన చేశారు. రుబియో పర్యటన సందర్భంగా ఇరు దేశాలు వాణిజ్యం, ఇంధనం, సాంకేతికత, రక్షణ, పరస్పర సంబంధాలపై చర్చలు జరిపాయి. ఈ నెల ప్రారంభంలో వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ కూడా వాణిజ్య ఒప్పందంపై అమెరికా వాణిజ్య ప్రతినిధి జేమ్సన్ గ్రీర్‌తో సమావేశమయ్యారు.








