కనెక్టికట్ తెలుగు సంఘం ఆధ్వర్యంలో దసరా, దీపావళి సంబరాలకు అంతా సిద్ధం… అలరించనున్న లైవ్ మ్యూజికల్ కన్సర్ట్!
కనెక్టికట్ తెలుగు సంఘం (TACT) ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న దసరా అండ్ దీపావళి సెలబ్రేషన్స్ – 2026 కార్యక్రమానికి సర్వం సిద్ధమైంది. ఈ వేడుకల్లో భాగంగా ప్రఖ్యాత గాయని సుమంగళి, తరుణ్ బృందం ఆధ్వర్యంలో అద్భుతమైన లైవ్ మ్యూజికల్ సింగింగ్ ఈవెంట్‌ను ఏర్పాటు చేశారు. మధురమైన పాటలు, ఉత్సాహపరిచే రిథమ్‌తో కూడిన ఈ సంగీత విభావరి ప్రేక్షకులను చివరి వరకు అలరించనుంది.
కార్యక్రమ వివరాలు…
తేదీ: అక్టోబర్ 24, 2026 (శనివారం)
వేదిక: రాక్‌విల్లే హైస్కూల్, 70 లోవ్ల్యాండ్ హిల్ రోడ్, వెర్నాన్, CT 06006
సాంస్కృతిక కార్యక్రమాలు: మధ్యాహ్నం 1:30 – సాయంత్రం 5 PM
విందు భోజనం (Dinner): సాయంత్రం 5:30 PM – 6:30 PM (డిన్నర్ కూడా ఏర్పాటు చేస్తున్నారు)
లైవ్ కన్సర్ట్: సాయంత్రం 6:30 PM – రాత్రి 9 గంటల వరకు
డాన్స్ పోటీలు, లైవ్ సింగింగ్‌తో పాటు ఈ వేడుకలు అత్యంత వైభవంగా జరగనున్నాయి. డాన్స్ రిజిస్ట్రేషన్లు, వెండర్ స్టాల్స్ కోసం [email protected] మెయిల్ ద్వారా సంప్రదించవచ్చు.
టికెట్ల కోసం… https://eventvidia.com/s/tactdasaradiwali వెబ్‌సైట్‌ని విజిట్ చేయాలని నిర్వాహకులు కోరారు. సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు: ఉష – +1(732) 874-0355, లిఖిత – +1(443) 881-8009








