మీ ఖాతాలోకి అనుకోకుండా డబ్బులు వచ్చాయా? ఎవరో పొరపాటున పంపామని ఫోన్ చేస్తున్నారా? వెంటనే తిరిగి పంపకండి. అది మోసానికి మొదటి అడుగు కావచ్చు.
ఖాతాలో డబ్బులు పడ్డాయా?
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ 'Jumped Deposit Scam'పై హెచ్చరించింది. తన అధికారిక X ఖాతాలో ఈ మోసం గురించి వివరించింది.
SBI కీలక హెచ్చరిక!
సైబర్ నేరగాళ్లు మొదట కొన్ని రూపాయలు లేదా వందల రూపాయలు మీ ఖాతాలో జమ చేస్తారు. ఆ తర్వాత పొరపాటున పంపించామని చెబుతూ ఫోన్ చేస్తారు.
మొదట చిన్న మొత్తమే!
డబ్బులు తిరిగి పంపాలని మీరు సిద్ధమైనప్పుడు, నేరగాళ్లు UPI Collect Request పంపుతారు. అందులోని మొత్తాన్ని చూడకుండా ఆమోదిస్తే పెద్ద మొత్తాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది.
అసలు ట్రాప్ ఇక్కడే!
UPI PIN నమోదు చేసే ముందు చెల్లింపు వివరాలను చదవండి. డబ్బులు అందుకోవడానికి సాధారణంగా PIN అవసరం ఉండదు. తెలియని రిక్వెస్ట్‌ను ఆమోదించకండి.
PIN అడిగితే ఆగండి!
తెలియని వ్యక్తికి నేరుగా డబ్బులు పంపవద్దు. ఖాతా స్టేట్మెంట్లో డిపాజిట్‌ను తనిఖీ చేయండి. అనుమానాస్పద రిక్వెస్ట్‌ను తిరస్కరించండి. అవసరమైతే బ్యాంకును సంప్రదించండి.
ఈ 4 జాగ్రత్తలు తప్పనిసరి
సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930కు కాల్ చేయండి. cybercrime.gov.inలో ఫిర్యాదు చేయండి. మీ బ్యాంకుకు కూడా సమాచారం ఇవ్వండి.
డబ్బులు పోగొట్టుకున్నారా?
ఖాతాలో డబ్బులు జమ కావడం వేరు.. UPI రిక్వెస్ట్‌ను ఆమోదించడం వేరు. ప్రతి లావాదేవీ వివరాలను పరిశీలించిన తర్వాతే PIN నమోదు చేయండి.
ఈ విషయం గుర్తుంచుకోండి!