న్యూజెర్సీలో ‘టీఫాస్ స్టార్స్ 2026’ పోటీలు.. ఎన్నారై విద్యార్థుల కోసం తెలుగు కళా సమితి ఘన ఏర్పాట్లు!
అమెరికాలోని న్యూజెర్సీలో ప్రవాస తెలుగు విద్యార్థుల ప్రతిభను వెలికితీసేలా తెలుగు కళా సమితి(Telugu Fine Arts Society – TFAS) ఆధ్వర్యంలో టీఫాస్ స్టార్స్ 2026(TFAS Stars 2026) పోటీలను నిర్వహించనున్నారు. లెట్ యువర్ టాలెంట్ షైన్!(Let Your Talent Shine!) నినాదంతో ఈ వేడుకలు జరగనున్నాయి.
తేదీల వివరాలు:
సంగీతం, మోనోలాగ్ & ఇన్స్ట్రుమెంటల్: అక్టోబర్ 24, 2026 (శనివారం)
డ్యాన్స్: అక్టోబర్ 25, 2026 (ఆదివారం)
వేదిక: 145 టాల్మడ్జ్ రోడ్, సూట్-18, ఎడిసన్, NJ 08817 (145 Talmadge Rd, Ste-18, Edison, NJ 08817)
రిజిస్ట్రేషన్ వివరాలు, చివరి తేదీ:
దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ: అక్టోబర్ 15, 2026(గురువారం).
రిజిస్ట్రేషన్ ఫీజు: ఒక్కో వ్యక్తికి $15, కనీసం నలుగురు సభ్యులున్న గ్రూప్‌నకు $50, ఎనిమిది మంది కంటే ఎక్కువ ఉన్న గ్రూప్‌నకు $70గా నిర్ణయించారు.
రిజిస్ట్రేషన్ కోసం https://www.cognitoforms.com/Tfas1/_2026TFASSTARSSM లింక్‌ను లేదా పోస్టర్‌లోని క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయవచ్చు.
పోటీల విభాగాలు:
సంగీతం: సోలో క్లాసికల్ సింగింగ్, సోలో నాన్ క్లాసికల్ సింగింగ్, గ్రూప్ క్లాసికల్ సింగింగ్, గ్రూప్ నాన్ క్లాసికల్ సింగింగ్.
నృత్యం: సోలో క్లాసికల్ డాన్స్, సోలో నాన్ క్లాసికల్ డాన్స్, గ్రూప్ క్లాసికల్ డాన్స్, గ్రూప్ నాన్ క్లాసికల్ డాన్స్.
జనరల్ విభాగాలు: ఇన్స్ట్రుమెంటల్ (సంగీత వాయిద్యాలు), మోనోలాగ్ (తెలుగు), పాత్రధారి (తెలుగు), మరియు క్యారెక్టర్ పెర్ఫార్మెన్స్ (తెలుగు).
విజేతలకు TFAS దీపావళి ఈవెంట్లో అవార్డులు అందజేయనున్నారు. నియమ నిబంధనల కోసం www.tfasnj.org వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు. మరిన్ని వివరాల కోసం రాశి శంషాబాద్ (954-465-7856), మీనా కురెచేటి (630-229-5234), లేదా వైశాలి పొనకాల (424-390-3456) నంబర్లలో సంప్రదించవచ్చని నిర్వాహకులు తెలిపారు.








