‘ENE Repeat’ : ఓవర్సీస్లో తరుణ్ భాస్కర్ మ్యాజిక్ వర్కవుట్ అయ్యిందా? వసూళ్లు పరిస్దితి ఏమిటి ?
తెలుగు సినిమాలకు ఓవర్సీస్లో ప్రత్యేకమైన మార్కెట్‌ను సృష్టించిన దర్శకుల్లో తరుణ్ భాస్కర్ ఒకరు. ముఖ్యంగా ఆయన తెరకెక్కించిన ‘ఈ నగరానికి ఏమైంది’ సినిమా అమెరికాలో మంచి ఆదరణ పొందింది. యూత్ ఆడియన్స్‌లో ఇప్పటికీ ఆ సినిమాకు ప్రత్యేకమైన క్రేజ్ ఉంది.
ఇప్పుడు అదే చిత్రానికి సీక్వెల్‌గా వచ్చిన ‘ENE Repeat’ కూడా నార్త్ అమెరికా బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే ఆరంభాన్ని అందుకుంది. విడుదలైన తొలిరోజే హాఫ్ మిలియన్ డాలర్ల మార్కును దాటి ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరిచింది.
విశ్వక్ సేన్, అభినవ్ గోమఠం, శివాత్మిక రాజశేఖర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ప్రీమియర్ షోల నుంచే భారీ వసూళ్లు సాధించింది. ప్రీమియర్ల ద్వారా $350Kకు పైగా రాబట్టగా, విడుదలైన మొదటి రోజు మరో $200Kకు పైగా వసూలు చేసింది.
దీంతో ప్రీమియర్ షోలతో కలిపి నార్త్ అమెరికాలో సినిమా మొత్తం వసూళ్లు $556Kకు చేరాయి. అక్కడ 348 లొకేషన్లలో ఈ సినిమా ప్రదర్శితమవుతోంది. ఈ స్థాయి ఓపెనింగ్‌తో ‘ENE Repeat’ ఓవర్సీస్ మార్కెట్లో బలమైన ప్రదర్శన కనబరుస్తోంది.
‘ఈ నగరానికి ఏమైంది’ చిత్రంతో యూత్‌లో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్న తరుణ్ భాస్కర్‌కు ఈ సీక్వెల్‌పై మొదటి నుంచీ అంచనాలు ఉన్నాయి. దర్శకుడిగా చాలా కాలం విరామం తర్వాత వచ్చినప్పటికీ, ఆయన సినిమాపై ఓవర్సీస్ ప్రేక్షకుల్లో ఆసక్తి తగ్గలేదని తొలి రోజు వసూళ్లు నిరూపిస్తున్నాయి.
తొలి వారాంతం ముగిసేలోపు ఈ సినిమా $1 మిలియన్ వసూళ్ల మార్కును చేరుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. విమర్శకుల నుంచి వస్తున్న సానుకూల స్పందన కూడా ఈ లక్ష్యానికి తోడ్పడే అవకాశముంది.
ఇవి కూడా చదవండి
అలాగే…హైదరాబాద్‌లో ఈ సినిమా కోసం 120కి పైగా ప్రీమియర్ షోలు ప్రదర్శించగా, వాటిలో 100కు పైగా షోలు హౌస్‌ఫుల్ అయినట్లు చిత్ర బృందం వెల్లడించింది. నాస్టాల్జియా, స్నేహం, వినోదం కలగలిసిన కథ ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో సినిమాకు మంచి స్పందన లభించింది.
తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ.15.27 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించినట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. అంతేకాదు, తన కల్ట్ ప్రీక్వెల్ ‘ఈ నగరానికి ఏమైంది’ లైఫ్‌టైమ్ వసూళ్లను కేవలం ఒక్క రోజులోనే అధిగమించినట్లు వెల్లడించారు. ఒక సినిమా సాధించిన వసూళ్లను దాని సీక్వెల్ తొలిరోజే దాటడం ఈ ఫ్రాంచైజీకి చెప్పుకోదగ్గ మైలురాయిగా నిలిచింది.
ముఖ్యంగా ప్రీమియర్ షోల నుంచే సినిమాపై భారీ ఆసక్తి కనిపించింది. అభిమానులు, ప్రేక్షకుల నుంచి వచ్చిన పాజిటివ్ టాక్ ఓపెనింగ్ డే వసూళ్లకు మరింత బలాన్నిచ్చింది. తరుణ్ భాస్కర్ తనదైన హాస్యం, గ్యాంగ్ అల్లరి, స్నేహబంధంలోని వినోదాన్ని మరోసారి తెరపైకి తీసుకొచ్చారు. పాత సినిమాను గుర్తు చేస్తూనే కొత్త అనుభూతిని అందించడం ఈ చిత్రానికి కలిసొచ్చిన అంశంగా కనిపిస్తోంది.
ఫ్రెండ్షిప్ కామెడీకి సర్వైవల్ అంశాలను జోడించి రూపొందించిన ఈ సినిమా నార్త్ అమెరికా ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఇదే వసూళ్ల జోరు కొనసాగితే ఓపెనింగ్ వీకెండ్లో మరింత మంచి ఫలితాన్ని నమోదు చేసే అవకాశం ఉంది.
—సూర్య ప్రకాష్ జోశ్యుల







