భక్తి, తాత్త్విక వ్యాఖ్యానాలతో ఆకట్టుకున్న ‘‘హర హర మహాదేవ – శివ తత్త్వాలు’’
SPB మ్యూజిక్ అకాడమీ, న్యూయార్క్ తెలంగాణ తెలుగు సంఘం సంయుక్తాధ్వర్యంలో నవంబర్ 14 న ‘‘హరహర మహాదేవ -శివ తత్త్వాలు’’ అనే భక్తి, సంగీత కార్యక్రమం జరిగింది. హిక్స్ విల్ లోని ఆసామయి హిందూ టెంపుల్ అండ్ సాయి దర్బార్ లో ఈ కార్యక్రమం జరగ్గా, స్వరవీణాపాణి తమ భక్తి గీతాలు, తాత్విక వ్యాఖ్యానాలతో అందర్నీ ఆకట్టుకున్నారు.
మిథునం సంగీత దర్శకులు, శ్రీ స్వర వీణాపాణి శివ మహిమను, తత్వాన్ని ఆవిష్కరించే భావపూర్ణ గీతాలతో సభ అంతా భక్తి భావంతో నిండిపోయింది. 72 మేళ కర్త రాగాలతో రూపొందించిన కీర్తనల ప్రదర్శన ఈ కార్యక్రమానికి స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. సుమారు 62 గంటల నిరంతర సంగీత ప్రదర్శనతో గిన్నిస్ ప్రపంచ రికార్డు సాధించిన ఆయన, రాగాల విశిష్టతను, గీతాల అంతరార్థాన్ని కూడా వివరించారు.
హైదరాబాద్ కి చెందిన ప్రఖ్యాత గాయకుడు వైఎస్ రామకృష్ణ భక్తి గీతాలను హృద్యంగా ఆలాపించారు. SPBMA గాయకులు కుమార్ బుధరాజు, వేణు పాల్యం, శ్రీనివాస్ గూడూరు, రాజేశ్వరి బుర్రా కూడా పాటలను ఆలాపించారు. వీరి పాటలను కూడా శ్రోతలను ఆకట్టుకున్నాయి.

ఇక.. న్యూయార్క్ లో పెరిగి, కళా రంగంలో రాణిస్తున్న యువ ప్రతిభావంతులను ఈ సందర్భంగా SPB మ్యూజిక్ అకాడమీ సత్కరించింది. చిన్న తనం నుంచే న్యూయార్క్ తెలుగు సంస్థల వేదికలపై పాటలు, వాయిద్యాలు, నాటకాలతో విశేష ప్రతిభ కనబరిచిన ఈశ్వర్ దొమ్మరాజు, ఇప్పటికే మూడు చిత్రాలలో నటించి మరిన్ని చిత్రాల్లో అవకాశాలను కూడా దక్కించుకున్నారు. అలాగే తెలుగు సారస్వత సాంస్కృతిక సంఘం మాజీ ఉదయ్ దొమ్మరాజు, హేమ దొమ్మరాజు దంపతుల తనయుడు.అలాగే వీరి కుమార్తె దివ్య దొమ్మరాజు సాంస్కృతిక, సామాజిక సేవలో చురుగ్గా పాల్గొంటున్నారు. ఆమె చేస్తున్న కృషిని కూడా సమావేశం అభినందించింది.
మరో వైపు ఈ కార్యక్రమ భాగస్వాములు అయిన NYTTA ప్రెసిడెంట్ డా. రవీందర్ కోడెలను, SPBMA ప్రెసిడెంట్ శ్రీనివాస్ గూడూరు ను కూడా అభినందిస్తూ, సత్కరించారు. ఈ కార్యక్రమానికి సహకారం అందించిన TLCA ట్రస్టీ మోహన్ బాధే, ప్రెసిడెంట్ సుమంత్ రామిశెట్టి, TTA ప్రెసిడెంట్ ఎలెక్ట్ సహోదర్ పెద్దిరెడ్డి ని సత్కరించారు.
అలాగే భక్తి గీతాలు, తత్విక వ్యాఖ్యానాలతో శ్రోతలను అలరించిన వీణాపాణిని అన్ని సంస్థల ప్రతినిధులు శాలువాతోసత్కరించారు. తర్వాత తానా రీజినల్ వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ బర్తవరపును, బాస్టన్ నుంచి విచ్చేసిన ప్రముఖ గాయకులు వైఎస్ రామకృష్ణను కూడా ఆత్మీయతతో సత్కరించారు.
ఇక.. అన్ని సంస్థల శ్రేయోభిలాషి, మహా దాతగా పేరు గాంచిన డా. పైళ్ల మల్లారెడ్డికి నిర్వాహకులు ధన్యవాదాలు తెలియజేశారు. అలాగే SPBMA ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు కుమార్ బుధరాజు, వేణు పాల్యం ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతలుగా నిర్వహించారు.శ్రీ వీణాపాణి గారికి మృదంగం తో సహకారం అందించిన చిన్నారు నవనీత్ అయ్యర్ అందరి హృదయాలు దోచుకున్నాడు. వీణాపాణి ఆ అబ్బాయిని ప్రత్యేకంగా ప్రశంసించి శాలువా తో సన్మానించి ఆశీర్వదించారు.
అలాగే ఈ కార్యక్రమం విజయవంతం అవ్వడానికి తెర వెనుక కృషి చేసిన సునీల్ రెడ్డి, మహేష్, విజయేందర్, వాణి చందు సింగిరికొండ, వాణి అనుగు, పద్మ కొడెల, రమ వనమకి SPB మ్యూజిక్ అకాడమీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపింది. డోనర్స్ కి, వాలెంటీర్స్ కి, సంగీత అభిమానులకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు ప్రకటించారు.

NYTTA చైర్మన్ డా. రాజేందర్ రెడ్డి జిన్నా, వైస్ చైర్మన్ లక్ష్మణ రెడ్డి అనుగు, అడ్వైజర్ చినబాబు రెడ్డి, SPBMA చైర్మన్ హరి ఎప్పనపల్లి, సంఘ బోర్డు సభ్యులు సుజాత వెంపరాల, లావణ్య మడకశిర, రాజేశ్వరి బుర్ర, TLCA కార్యవర్గ సభ్యులు శిరీష తునుగుంట్ల అభినందనలు తెలిపారు. కార్యక్రమ నిర్వాహకులు శ్రీనివాస్ గూడూరు మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి అన్ని సంస్థల నాయకులు, కార్యకర్తలు సహాయం చేశారని, అందరి సమష్టి కృషి ఫలితమేనని ప్రకటించారు. న్యూయార్క్ లోని వివిధ తెలుగు సంస్థల నాయకుల భాగస్వామ్యం పరస్పర సహకారానికి, ఐక్యతకు ప్రతీకగా నిలిచిందన్నారు.

చివరగా కార్యక్రమానికి ఉదారంగా సహకరించిన దాతలకు అకాడమీ ధన్యవాదాలు తెలిపింది. అందరి ఆశీర్వాదాలతో బాలు ప్రేరణతో వెలసిన SPBMA మరిన్ని మంచి కార్యక్రమాలని అందిస్తుందని తెలిపారు. ఉత్సాహంగా పాల్గొన్న సంగీతాభిమానులకు, కుటుంబాలకు, వాలెంటీర్స్ కి, తెలుగు సమాజ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలిపారు. రుచికరమైన భోజనం, ఆత్మీయ ఆతిథ్యంతో సాగిన ఈ వేడుక మధురానుభూతులను మిగిల్చింది.







