TTS ఆధ్వర్యంలో అత్యంత ఉత్సాహభరితంగా బౌలింగ్ టోర్నమెంట్
టెన్నెస్సీ తెలుగు సమితి (TTS) ఆధ్వర్యంలో అత్యంత ఉత్సాహభరితంగా బౌలింగ్ టోర్నమెంట్ జరిగింది. పురుషుల దినోత్సవాన్ని పురస్కరించుకొని టెన్నెస్సీ తెలుగు సమితి నవంబర్ 14 న ఈ బౌలింగ్ టోర్నమెంట్ ను నిర్వహించింది. అత్యంత స్నేహపూర్వకంగా, సమిష్టి కృషితో, క్రీడా స్ఫూర్తితో ఈ వేడుకలు జరిగాయి.

ఈ బౌలింగ్ టోర్నమెంట్ లో మొత్తం 8 జట్లు అత్యంత ఉత్సాహంగా పాల్గొన్నాయి. పాల్గొన్న జట్ల వివరాలు ఇవే…
బనానా స్పైక్ (Banana Spike) – వంశీ
డ్రాగన్ స్ట్రైక్స్ (Dragon Strikes) – సారథి
టీమ్ డబ్ల్యూపీ (Team WP) – అశ్విన్
ఫ్రాంక్లిన్ లెజెండ్స్ (Franklin Legends) – వెంకట
మ్యూజిక్ సిటీ రోలర్స్ (Music City Rollers) – అభిషేక్
బ్రేకింగ్ పిన్స్ (Breaking Pins) – విష్ణు
బ్యాడ్ బీట్ స్ట్రైకర్స్ (Bad Beat Strikers) – సుధాగోని
అమిగోస్ (Amigos) – నంద గోపాల్

ఇక.. హోరాహోరీగా సాగిన కొన్ని రౌండ్ల తర్వాత బ్యాడ్ బీట్ స్ట్రైకర్స్, టీమ్ డబ్ల్యూపీ, బనానా స్పైక్, బ్రేకింగ్ పిన్స్, మరియు డ్రాగన్ స్ట్రైక్స్ జట్లు తుది దశ (ఫైనల్ స్టేజ్)కు చేరుకున్నాయి.
టోర్నమెంట్ ఫలితాలు:
విజేతలు (ఛాంపియన్స్): బనానా స్పైక్
రన్నరప్: బ్రేకింగ్ పిన్స్
ఈ సందర్భంగా విజేతలకు, రన్నరప్ జట్టుకు టెన్నెస్సీ తెలుగు సమితి హృదయపూర్వక అభినందనలు తెలిపింది. అలాగే ఈ టోర్నమెంట్ను విజయవంతం చేయడంలో కీలక పాత్ర పోషించిన జట్ల కెప్టెన్లు, క్రీడాకారులు, నిర్వాహకులు మరియు వాలంటీర్లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసింది.
క్రీడాస్ఫూర్తి, ఐక్యత, స్నేహం మరియు ప్రవాస తెలుగు వారి మధ్య ఆత్మీయ అనుబంధాన్ని చాటిచెప్పేలా ఈ కార్యక్రమం ఎంతో విజయవంతంగా ముగిసింది.







