18th November 2026

_________

- Bhuvana

పిల్లల చేత జంక్ ఫుడ్ మాన్పించటానికి ఈజీ టెక్నిక్స్

చిప్స్, పిజ్జా, బర్గర్లు, చాక్లెట్లు.. పిల్లలకు ఇవే కావాలి. రోజూ ఏదో ఒకటి కావాలని మారాం చేస్తున్నారా? కొన్ని చిన్న మార్పులతో ఈ అలవాటును తగ్గించవచ్చు.

జంక్ ఫుడ్‌కు పిల్లలు బానిసలవుతున్నారా?

చిప్స్, బర్గర్లలో ఉప్పు, చక్కెర, కొవ్వు ఎక్కువగా ఉంటాయి. వీటి రుచికి పిల్లలు త్వరగా అలవాటుపడతారు. ఆకర్షణీయమైన ప్యాకెట్లు, ప్రకటనలు కూడా వారిని ఆకట్టుకుంటాయి.

జంక్ ఫుడ్ ఎందుకంత ఇష్టం?

- అడిగిన ప్రతిసారీ జంక్ ఫుడ్ కొనివ్వకండి. - చాక్లెట్లను రివార్డులుగా ఇవ్వకండి. - ఇంట్లో చిప్స్, కూల్‌డ్రింక్స్ నిల్వ చేయకండి.

ఈ తప్పులు చేయకండి!

- కోప్పడకుండా ఓపికగా మాట్లాడండి. - ఎందుకు కావాలో తెలుసుకోండి. - ఇష్టమైన రుచికి దగ్గరగా హెల్దీ ఫుడ్ ఇవ్వండి.

పిల్లలు మారాం చేస్తే..

చిప్స్, కుర్కురే కొనడం తగ్గించండి. రోజూ కొత్త హెల్దీ టిఫిన్ ఇవ్వండి. మధ్యలో ప్యాకెట్ స్నాక్స్ అలవాటు తగ్గించండి.

ఇంట్లో ఈ మార్పులు చేయండి!

హోంవర్క్ చేస్తే చాక్లెట్, మంచి మార్కులు వస్తే పిజ్జా.. ఇలా ఆహారాన్ని బహుమతిగా ఇవ్వకండి. బదులుగా ఆటలు, కథలు, స్టిక్కర్లు వంటి వాటితో పిల్లలను ప్రోత్సహించండి.

ఫుడ్‌తో రివార్డులు వద్దు!

కూరగాయలు కొనేటప్పుడు పిల్లలను వెంట తీసుకెళ్లండి. పండ్లు కడగడం, సలాడ్ తయారు చేయడం వంటి పనుల్లో భాగస్వాములను చేయండి. తామే తయారు చేసిన ఆహారం తినేందుకు పిల్లలు ఎక్కువ ఆసక్తి చూపుతారు.

వంటలో పిల్లలకూ పని చెప్పండి!

పండ్లు, నట్స్, పల్లీలు, ఓట్స్, పెరుగు, పాలు, శనగలు, మఖానా వంటి పోషకాహార పదార్థాలను ఇంట్లో ఉంచండి. ఆకలేసినప్పుడు ఇవి స్నాక్స్‌గా ఇవ్వండి.

ఇంట్లో ఇవి అందుబాటులో ఉంచండి!

- చిప్స్ – వేయించిన శనగలు, మఖానా - బర్గర్ – పనీర్ శాండ్‌విచ్ - పిజ్జా – హోమ్‌మేడ్ వెజ్ పిజ్జా - నూడుల్స్ – వెజిటబుల్ నూడుల్స్

జంక్ ఫుడ్‌కు హెల్దీ ప్రత్యామ్నాయాలు!