తెలుగు అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ ఛార్లెట్ ఏరియా ఆధ్వర్యంలో స్వచ్ఛతా కార్యక్రమం
తెలుగు అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ ఛార్లెట్ ఏరియా వారు ఓ గొప్ప కార్యక్రమాన్ని నిర్వహించారు. స్వచ్ఛతా కార్యక్రమాన్ని నిర్వహించారు. తెలుగు అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ ఛార్లెట్ పక్షాన దత్తత తీసుకున్న ప్రాంతాలలో స్వచ్ఛతా కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ స్వచ్ఛతా కార్యక్రమంలో తెలుగు అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ ఛార్లెట్ ఏరియా వాలెంటీర్లు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అంతేకాకుండా అత్యంత అంకిత భావంతో స్వచ్ఛతా కార్యక్రమాన్ని నిర్వహించారు. నగర వీధులను పరిశుభ్రంగా ఉంచడంలో తమ వంతు బాధ్యతను నిర్వర్తిస్తూ ప్రవాస భారతీయులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్నారు. దారుల వెంబడి వున్న చెత్తా చెదారాన్ని తొలగించి, దానిని ఓ ప్లాస్టిక్ సంచీలో వేసేశారు. ఇది ఓ సామాజిక బాధ్యతగా తాము నిర్వహిస్తున్నామని వాలెంటీర్లు తెలిపారు.







