న్యూజెర్సీ ఇస్కాన్ టెంపుల్ లో ‘‘గోపాష్టమి వేడుకలు’’.. భక్తులకు ఆహ్వానం
అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం (ISKCON) న్యూజెర్సీ ఆధ్వర్యంలో అత్యంత పవిత్రమైన ‘గోపాష్టమి’ (Gopa-Ashtami) వేడుకలను నిర్వహించనున్నారు. ఈ పండుగ రోజున శ్రీకృష్ణ పరమాత్ముడు కేవలం దూడలను కాసేవాడి నుండి, ఒక పూర్తి గోపాలకుడిగా (Qualified Cowherd) మారిన అద్భుతమైన ఘట్టాన్ని స్మరించుకుంటారు.
నవంబర్ 17 తదేీన సాయంత్రం 7:00 గంటల నుంచి గోపాష్టమి వేడుకలను ప్రారంభిస్తారు. ఇస్కాన్, న్యూజెర్సీ (100 జాక్సన్విల్లె రోడ్, టొవాకో, NJ 07082) వేదికగా ఈ వేడుకలు జరిపేందుకు నిర్వాహకులు అన్నీ సిద్ధం చేశారు.
ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు తన బాల్యంలో కేవలం దూడలను మాత్రమే కాసేవాడు. ఆయనకు 8వ ఏట అడుగుపెట్టిన తర్వాత, నంద మహారాజు గోవులను కాచే బాధ్యతను శ్రీకృష్ణుడికి అప్పగించిన రోజే గోపాష్టమిగా ప్రసిద్ధి చెందింది. ఈ రోజున గోమాతను మరియు దూడలను పూజిస్తారు. గోవులో ముప్పై ముగ్గురు కోట్ల దేవతలు కొలువై ఉంటారని నమ్ముతారు.
ఈ సందర్భంగా ఇస్కాన్ చేసే కార్యక్రమాలివే..
శ్రీకృష్ణుడికి హారతి, కీర్తనలు మరియు దామోదరాష్టకం పఠనం
గోపాష్టమి విశిష్టత మరియు గోమాత ప్రాముఖ్యతపై ప్రవచనాలు (Glories of Gopastami)
భక్తులందరికీ రుచికరమైన మహా ప్రసాదం (Sumptuous Feast) విందు
భక్తులందరూ ఈ పవిత్ర వేడుకల్లో పాల్గొని శ్రీకృష్ణ భగవానుని కృపకు పాత్రులు కావాల్సిందిగా నిర్వాహకులు కోరుతున్నారు.







